చిన్నవయస్సులోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 23 ఏండ్ల జశ్వంత్ రెడ్డి భారత సైన్యంలో చేరారు. ఐదేండ్ల క్రితం భారత సైన్యంలో చేరిన జశ్వంత్ రెడ్డి ఉగ్రవాదులకు భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు.
ఉగ్రవాదులపై పోరులో భాగంగా కశ్మీర్‌లో ప్రాణ త్యాగంచేసిన గుంటూరు జిల్లా బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెంకు చెందిన జవాను జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దేశ రక్షణలో భాగంగా కశ్మీర్‌లో తన ప్రాణాలు పణంగాపెట్టి పోరాటం చేశారని, జశ్వంత్‌రెడ్డి త్యాగం నిరుపమానమైనది అన్నారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం పొందడంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. జశ్వంత్‌రెడ్డి త్యాగం మరువలేనిదని అన్నారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న జగన్ అక్కడి నుంచే ప్రభుత్వ సాయాన్ని ప్రకటించారు. కష్టకాలంలో జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి తోడుగా నిలవాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు. జశ్వంత్‌రెడ్డి సేవలు వెలకట్టలేనివని, ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా రూ.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందన్నారు.
2021, జూలై 08వ తేదీ గురువారం రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా వాసి జశ్వంత్ రెడ్డి అమరుడయ్యారు. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ముష్కరులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.
చిన్నవయస్సులోనే దేశానికి సేవ చేయాలనే లక్ష్యంతో 23 ఏండ్ల జశ్వంత్ రెడ్డి భారత సైన్యంలో చేరారు. ఐదేండ్ల క్రితం భారత సైన్యంలో చేరిన జశ్వంత్ రెడ్డి ఉగ్రవాదులకు భారత బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు.