ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్త్ గేమ్స్-2022లో మీరాబాయి చాను వెయిట్ లిఫ్టింగ్ లో తొలి స్వర్ణం పతకాన్ని సాధించారు. దీంతో దేశ ప్రధాని మోదీ.. మీరాబాయి చానుని అభినందించారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం ఆమెను అభినందించారు. ఆమె ఈ పతకం సాధించడం పట్ల దేశ ప్రజల నుంచి మాత్రమే కాకుండా హాలీవుడ్ తారల నుండి కూడా ప్రశంసలు వస్తోన్నాయి. తాజాగా హాలీవుడ్ స్టార్ క్రిస్ హెమ్స్ వర్త్ మీరాబాయిని ప్రశంసించారు. ఆయన “థోర్” సినిమాలో హీరోగా నటించి భారతదేశంలో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న మీరా బాయి చాను దేశ ప్రజలకు ధన్యవాదాలు చెబుతూ ఒక ట్వీట్ చేశారు. స్వర్ణం గెలిచిన అనంతరం… గోల్డ్ మెడల్ వేసుకున్న ఫిక్స్ పోస్ట్ చేస్తూ..”201 కేజీల బరువును ఎత్తడం అంత తేలికైన పని కాదు. కానీ, కోట్లాది ప్రజల అభిమానానికి, ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతీ సవాలును పూర్తి చేసేందుకు ఒకే ఒక్క అవకాశం దక్కుతుంది” అని ట్వీట్ చేశారు. ఈ క్రమంలో అనేక మంది నెటిజన్లు మీరాబాయి చాను ట్వీట్ కి స్పందించారు. మీరా బాయి చేసిన ట్వీట్ పై ఒక యూజర్ చేసిన కామెంట్ కు హాలీవుడ్ స్టార్ క్రిసె హెమ్స్ వర్త్ స్పందించారు. మీరాబాయి చాను చేసిన ట్వీట్ పై సౌరభ్ సిన్హా అనే యూజర్ “థోర్, ఇక ఆయుధాన్ని వదిలేయాల్సిన సమయం వచ్చింది” అంటూ క్రిస్ హెమ్స్‌వర్త్ ను ట్యాగ్ చేశారు.
Lifting 201kg never felt easy but thanks to the love and wishes of billions back home, every challenge is just an attempt away. 🇮🇳#WeAreTeamIndia #TeamIndia pic.twitter.com/GnyaftZkpv
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) July 30, 2022
“థోర్” సినిమాలో ప్రధాన పాత్ర థోర్ ఓడిన్‌సన్ దగ్గర సుత్తిని పోలిన ఆయుధం ఉంటుంది. ఇది చాలా బరువుతో ఉంటుందని, ప్రత్యేక శక్తులున్నవారు మాత్రమే దీనిని ఎత్తగలరు అని సినిమాలో చూపిస్తారు. థోర్ దగ్గర ఉండే ఆ ప్రత్యేక సుత్తి ఎప్పటికీ విరగదు, చెక్కు చెదరదు. నెటిజన్ కామెంట్ కు క్రిస్ హెమ్స్‌వర్త్ స్పందించారు. “ఆమె అర్హురాలు. అభినందనలు సైఖోమ్! మీరొక లెజెండ్” అని అంటూ క్రిస్ ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ కు మీరాబాయి స్పందించారు. “థాంక్యూ సో మచ్. మీ సినిమాలు చూడటాన్ని ఎల్లప్పుడూ ఇష్టపడతా” అంటూ ఆయన్ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
Time for Thor to give up his hammer. @chrishemsworth https://t.co/CtynsPBnhu
— Saurabh Sinha (@sinha_saurabh08) August 1, 2022
కామన వెల్త్ గెమ్స్ లో పాకిస్తాన్ కి తొలి స్వర్ణం సాధించిన నోరో దస్తగిర్ భట్ కూడా తనకు స్ఫూర్తి మీరాబాయి చానునే అని తెలిపారు. 2018లో ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నఆమె, ఇప్పుడు మళ్లీ గోల్డ్ సాధించారు. మరి.. మీరాబాయి చానుకు హాలీవుడ్ స్టార్ క్రిస్ అభినందలు తెలపడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
— Saikhom Mirabai Chanu (@mirabai_chanu) August 5, 2022