గర్భవతిగా ఉన్నప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి అంటారు. అలా అని ఏది పడితే అది తినలేం. ఇంట్లో బామ్మ, అమ్మలు అందుబాటులో ఉండి.. మనకు నచ్చిన ఆహారాన్ని వండి పెడితే.. ఆహా ఇంకే ఉంది. ఇదిగో మెగా కోడలు ఉపాసన కూడా ఇప్పుడు ఇలానే ఏంజాయ్ చేస్తున్నారు.
మెగా కోడలు ఉపాసన తన రోజువారి బాధ్యతలు నిర్వహిస్తూనే.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. తన పర్సనల్, అపోలో హస్పిటల్‌కు సంబంధించిన విషయాలు, ఇతర ఆసక్తికర అంశాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తు ఉంటుంది. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్. ఆమె మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవిస్తుంది. ఇక ఈ ఏడాది మెగా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. రామ్ చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అందుకుంది. ఇక ఇదే ఏడాది.. మెగా ఇంటికి వారసుడో, వారసురాలో రాబోతుంది. ఇక కొన్ని రోజుల క్రితమే దుబాయ్‌లో ఉపాసన సీమంతం వేడుకలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక తాజాగా ఉపాసన.. ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. దీనిలో మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజాన దేవి ఉన్నారు. ఆమె ఉపాసన కోసం ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తున్నారు. ఆదివారం కావడంతో.. అంజానదేవి.. తన మనవరాలు ఉపాసన కోసం పులావ్ తయారు చేశారు. ఆమె స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తూ.. పులావ్ తయారు చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఆదివారం నా కోసం ప్రేమతో ప్రత్యేక పులావ్.. ఇంతకు మించి ఏం అడగగలను అంటూ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజనులు.. అమ్మమ్మ చేసే వంటలు ఎప్పుడూ ప్రత్యేకమే కాక ఎంతో ఆరోగ్యం కూడా.. మనవరాలి కోసం అమ్మమ్మ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో.. ఇంతలా ప్రేమించే కుటుంబం దొరకడం మీ అదృష్టం.. సండే అమ్మమ్మ చేసిన పులావ్‌ని ఏంజాయ్ చేయండి.. టేక్ కేర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. 🤗🤗🤗 pic.twitter.com/EegIdtsU80
— Upasana Konidela (@upasanakonidela) April 16, 2023