శ్రీలంక (ఇంటర్నేషనల్ డెస్క్)- చైనా రాకెట్ ఎట్టకేలకు హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కంట్రోల్ తప్పిన చైనా రాకెట్ లాంగ్ మార్చ్ 5బి గత కొన్ని రోజుల నుంచి అతి వేగంగా భూమివైపు దూసుకువస్తోంది. సరిగ్గా ఈనెల 8న అది భూమిపై పడొచ్చని ఖగోళ నిపుణులు అంచనా వేశారు. ఐతే అది భూమిపై ఎక్కడ పడుతుందోనని ప్రపంచంమంతా ఆందోళన వ్యక్తం అయ్యింది. మన దేశ రాజధాని ఢిల్లీ పై పడే అవకాశాలు లేకపోలేదన్న వార్త మనల్ని కలవరానికి గురి చేసింది.
ఐతే ఎట్టకేలకు చైనా రాకెట్ హిందూ మహా సముద్రంలో కూలిపోయింది. సముద్రంలో కూలడానికి ముందే రాకెట్ తునాతునాకలు అయిపోయింది. మాల్డీవులు శ్రీలంక మధ్యలో ఈ రాకెెట్ సముద్రంలో కూలినట్టు చైనా ప్రకటించించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు రాకెట్ సముద్రంలో పడిపోయింది. మొత్తానికి చైనా రాకెట్ సముద్రంలో కూలడంతో అమెరికా నాసాతో పాటు భారత శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు.