ఫిల్మ్ డెస్క్- అఖండ.. ఇప్పుడు టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు. అవును నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి, ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
కరోనా సెంకడ్ వేవ్ తరువాత రిలీజైన పెద్ద సినిమా కావడంతో అంతా కాస్త కంగారు పడ్డారు, కానీ బాలయ్య బాబు అఖండ భారీ విజయం చూసి టాలీవుడ్ తెగ సంబరపడిపోతోంది. ఇదిగో ఇటువంటి సమయంలో అఖండ సినిమాపై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ పంతులు ఆసక్తిరమైన వ్యాఖ్యలు చేశారు. రంగరాజన్ మొట్టమొదటి సారి ఇలా ఓ సినిమాపై స్పందించడంతో కొంత ప్రధాన్యత సంతరించుకుంది.
రంగరాజన్ ఏమన్నారంటే.. పోయిన వారం నేను, నా స్వామి వారి సేవక బృందంతో బోయపాటిగారి దర్శకత్వంలో నిర్మితమైన అఖండ సినిమా చూశాను. పోయిన వారమే ఈ సినిమా గురించి చెప్పాలని అనుకున్నాను. కొన్ని కారణాల వల్ల చెప్పలేకపోయా. కానీ ఇవాల్టి రోజు ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ఈ సినిమాలో ప్రత్యక్షంగా చూపించారు. ధర్మాన్ని రక్షించడం కోసం మన అందరం కలిసి పోరాడాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
అంతే కాదు.. అహింసా ప్రథమో ధర్మ అనే వాక్యాన్ని మనకి వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో ఈ సినిమాలో చూపించడం జరిగింది. ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్దాంతాన్ని స్పష్టంగా చూపించారు. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ భగవంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. ఎందుకు ఇంత మంది ఈ సినిమాని చూస్తున్నారూ.. అంటే.. వారి మనసుల్లో ఈ ఉక్రోషం ఉంది. ఆక్రోషం ఉంది.. తపన ఉంది.
అయినా ఏమీ చేయలేకపోతున్నామే.. అనే ఆందోళనకరణతో కూడిన కోపం ఉంది. రాజ్యాంగం ఉంది.. అయినా మన ధర్మానికి అన్యాయం జరుగుతుంది. రామరాజ్య స్థాపన జరగాలని అందరి మనసుల్లో కోరిక ఉంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. అందుకోసమే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇది పాలకులు గుర్తించాలి.. అని చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు అన్నారు. అఖండ విజయం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదేనని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.