న్యూ ఢిల్లీ- మనం ఏం కొనాలన్నా ఇప్పుడంతా ఆన్ లైన్ లోనే. కూరగాయల నుంచి మొదలు టీవీలు, ఫ్రిజ్ ల వరకు ఏంకావాలన్నా ఆన్ లౌన్ లోనే ఆర్డర్ చేస్తున్నాం. ఈ కామార్స్ అందుబాటిలోకి వచ్చాక అన్నింటిని ఆన్ లైన్ లోనే కొనేయడం అలవాటైపోయింది. పైగా బయట మార్కెట్ కంటే ఈ కామార్స్ లో అన్నీ కాస్త చవక కూడా ఉండటంతో అందరు ఈ కామర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఐతే ఈ కామార్స్ లో చాలానే మోసాలు రుగుతుంటాయి. వీల్సీ సేల్స్ అని, క్లియరెన్స్ సేల్స్ అని, సేల్ ధమాకా అని ఇలా రక రకాల సెల్స్ పెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. అందులో కొంత క్లారిటీ ఉన్నా.. ఎక్కువ శాతం ఈ కామార్స్ సంస్థలు వినియోగదారులను మోసం చేస్తుంటాయి.
దీనిపై పెద్ద ఎత్తున పిర్యాదులు అందుతున్నాయి. ఈ కామర్స్ లో ఆర్డర్ చేసింది ఒకటైతే.. మరొక వస్తువు రావడం, లేదంటే ఆర్డర్ చేసిన వస్తువు నాణ్యతా లోపం ఉండటం వంటి ఎన్నో సమస్యలు వినియోగదారులకు ఎదురవుతున్నాయి. దీంతో ఈ కామర్స్ మోసాలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ కామర్స్ వేదికల ద్వారా వస్తువులు, సేవల మిస్ సెల్లింగ్, మోసపూరిత ఫ్లాష్ సేల్స్‌పై నిషేధం విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిపార్ట్ మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ వద్ద ఈ కంపెనీల తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఈ కామార్స్ సంస్థలను ఆదేశించింది. ఇంటర్నెట్ లో సెర్చ్ రిజల్ట్స్‌ను మోసపుచ్చి యూజర్లను తప్పుదోవ పట్టించడంపై నిషేధం విధించింది కేంద్ర ప్రభుత్వం.
వినియోగదారుల ఇబ్బందులను పరిష్కరించేందుకు ఈకామర్స్ సైట్లు చీఫ్ కంప్లయన్స్ ఆఫీసర్, రెసిడెంట్ గ్రీవియెన్స్ ఆఫీసర్‌ను తప్పనిసరిగా నియమించుకోవాలని కూడా కేంద్రం ఈ కామర్స్ సంస్థలకు తేల్చి చెప్పింది. వినియోగదారుల నుంచి ఏదైనా పిర్యాదు అందితే, విచారణకు సంబంధించి ఏ ప్రభుత్వ ఏజెన్సీ నుంచి ఆదేశాలు అందుకున్న 72 గంటల్లో ఈ కామర్స్ సంస్థలు అవసరమైన సమాచారం ఇవ్వాలి. ఇందుకోసం వినియోగదారుల పరిరక్షణ నిబంధన లు 2020లో ప్రభుత్వం పలు సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై జూలై 6 నాటికి అభిప్రాయాలు, సూచనలు తెలపాలని ప్రభుత్వం కోరింది. ఇది అమల్లోకి వస్తే ఇకపై ఈ కామర్స్ మోసాలకు చెక్ పడినట్టేనని నిపుణులు చెబుతున్నారు.