ఒక దేశంలో బతకాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. సగటు మనిషి ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవాల్సిందే. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే బతికే వాళ్లు ఉన్నట్లే.. నగరాల్లో ఉద్యోగాలు చేసి కోటీశ్వరులైన వారు ఉన్నారు. అయితే గ్రామాల్లో ఖర్చులు తక్కువ ఉంటాయి
ఒక దేశంలో బతకాలంటే కొన్ని ప్రమాణాలు ఉంటాయి. సగటు మనిషి ఆదాయ, వ్యయాలను బేరీజు వేసుకోవాల్సిందే. గ్రామాల్లో వ్యవసాయం చేసుకునే బతికే వాళ్లు ఉన్నట్లే.. నగరాల్లో ఉద్యోగాలు చేసి కోటీశ్వరులైన వారు ఉన్నారు. అయితే గ్రామాల్లో ఖర్చులు తక్కువ ఉంటాయి. ఏదైనా పని చేసుకుని బతికేయొచ్చు. కొద్ది పాటి సంపాదనతో కాలం వెళ్లదీయొచ్చు. అలాగే మెట్రో సిటీలు, నగరాల్లో ఖర్చులు వేరోలా ఉంటాయి. ఇక్కడ సంపాదన బట్టి ఖర్చులు పెరుగుతుంటాయి. నీటి దగ్గర నుండి ప్రతిదీ కొనుగోలు చేయాల్సిందే. మన దేశంలో పరిస్థితి అయితే ఇలానే ఉంటుంది. మరీ మిగిలిన దేశాల పరిస్థితి ఏంటీ. అసలు ప్రపంచంలో తక్కువ ఖర్చు పెడుతూ బతికే దేశాలున్నాయా..? అలా ఉంటే మన భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం.
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది పాకిస్తాన్. వినడానికి వింతగా ఉన్న ఈ దేశంలో 294 డాలర్లతో నెల మొత్తం బతికేయొచ్చట. అయితే ఉగ్రదాడులతో పాటు ఆహార, నీటి కొరత పుష్కలంగా ఉంది. బతుకు మీద ఆశ వదులకోవాల్సిందే. రెండు, మూడు స్థానాల్లో శ్రీలంక, నేపాల్ ఉన్నాయి. అయితే ఇవి కాస్త పేద దేశాలు. నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో అల్జీరియా, ఆఫ్ఘనిస్తాన్, లిబియా ఉన్నాయి. అయితే ఈ దేశాల్లో లిబియాలో అంతర్గపోరు ఉంటే ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల రాజ్యం నడుస్తోంది. అల్జీరియా అభివృద్ధి చెందిన దేశం కాదు. ఇక ఏడో స్థానంలో కొనసాగుతుంది మన భారత్. ఆ తర్వాత ట్యునీషియా, ఈజిప్ట్, గాంబియా దేశాలు ఉన్నాయి.
భారత్‌లో నెల మొత్తం 416 డాలర్లతో జీవించవచ్చునట. అంతేకాదు ఇక్కడ వనరులు పుష్కలంగా ఉంటాయి. భారత్‌లో ఏ పనైనా చేసుకోని బతకొచ్చు. తక్కువ ఖర్చుతో జీవితాన్ని నెట్టుకురావచ్చు. ఏ దేశంలో లేని వ్యక్తిగత స్వేచ్ఛ, మాట్లాడే హక్కు భారత్ సొంతం. ఈజిప్టు వంటి దేశాల్లో పరిస్థితులు మెరుగ్గానే ఉంటున్నాయి. ఇది ఇప్పుడిప్పుడే ఆధునిక ప్రపంచంతో కలిసి అడుగులు వేస్తోంది. అయితే అక్కడ ఎండలు ఎక్కవగా ఉంటాయి. కొంచెం తట్టుకోవడం కష్టం. ఏదీ ఎటు చూసినా భారత్‌లో బతకడమే అత్యంత తేలిక. భద్రత ఎక్కువ.