ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రచారంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారంట. తాము ముందస్తుకు వెళ్లబోవటం లేదని అన్నారంట.
ఆంధ్రప్రదేశ్‌లో పార్టీల రాజకీయాలు ఊపందుకున్నాయి. ఓ పార్టీని మించి మరో పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ కావచ్చు.. ప్రతిపక్ష పార్టీ కావచ్చు గెలుపే ప్రధానంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ ముందస్తు ఎన్నికలు వెళుతోందన్న ప్రచారం జరిగింది. అయితే, తమ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోవటం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికలకు ఇంకా సంవత్సరం పైనే ఉంది కాబట్టి.. ముందుకంటే మరింత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్థేశం చేశారట. దీనికి తగ్గట్టుగానే పార్టీ విధి విధానాలను తయారు చేస్తోందట.
ఈ నేపథ్యంలోనే ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరిట వైఎస్సార్ సీపీ ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలోని ప్రతీ గడపకు ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని తీసుకెళ్లబోతోంది. అంతేకాదు! ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేరుగా ప్రజల్లోకి వెళ్లనున్నారట. ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తిని పోగొట్టడానికి బస్సు యాత్ర నిర్వహించనున్నారట. రాష్ట్రంలోని ప్రతీ మండలంలో పర్యటించనున్నారట. ఇక, ప్రతి పక్ష పార్టీ కూడా ఎన్నికల కోసం పగడ్భందీగా సిద్ధం అవుతోంది. ఇప్పటికే నారా లోకేష్ ‘యువగళం’ పేరిట పాదయాత్ర మొదలుపెట్టారు. దాదాపు 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు.
మరోవైపు చంద్రబాబు కూడా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. మరోసారి గెలుపుకోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందస్తు ఎన్నికలకు పోనని చెప్పినా.. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో కొంత ఆలోచిస్తున్నారంట. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనా విధానం.. నాయకత్వ లక్షణం తెలిసిన వాడిగా.. ఆయన తీసుకునే నిర్ణయాల గురించి ఓ అంచనాకు వచ్చారట. ఇప్పుడు ముందస్తుకు వెళ్లబోమని చెప్పినా.. అప్పటి పరిస్థితులను బట్టి జగన్ ముందస్తుకు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారట. ఈ లక్షణం విషయంలో చంద్రబాబుకు, వైఎస్ జగన్ బాగా నచ్చారంట. వైఎస్ జగన్ తన మనసును ఎలా మార్చుకుంటారో తెలియదు కాబట్టి.. పార్టీ శ్రేణులను అలెర్ట్‌గా ఉండమని హెచ్చరిస్తున్నారట. మరి, ముందస్తు ఎన్నికలు జరిగితే ఎవరికి లాభమో.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.