ఆమె పీలమీడులోని హుడ్కో కాలనీలో రోడ్డుపై నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ కారు ఆమె వెనకాల వస్తూ ఉంది. కౌశల్యను సమీపించగానే ఓ వ్యక్తి కారు విండోలోంచి భుజం వరకు బయటకు పెట్టాడు.
ఈ మధ్య కాలంలో చైన్ స్నాచర్లు బాగా బరి తెగించేస్తున్నారు. దొంగతనాలు చేయటానికి కొత్త కొత్త దారులు వెతుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు బైకుల మీద వచ్చి దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు బరితెగించేశారు. కార్లలో వచ్చి మరీ దొంగతనాలు చేస్తున్నారు. తాజాగా, ఓ ఇద్దరు దొంగలు కారులో వచ్చి చైన్ స్నాచింగ్‌కు యత్నించారు. మహిళ మెడలోని గొలుసును లాక్కెళ్లటానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే మహిళను కారులోంచి లాక్కెళ్లారు. ఈ సంఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కోయంబత్తూరుకు చెందిన కౌశల్య ఆదివారం రోజున రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది.
ఆమె పీలమీడులోని హుడ్కో కాలనీలో రోడ్డుపై నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఓ కారు ఆమె వెనకాల వస్తూ ఉంది. కౌశల్యను సమీపించగానే ఓ వ్యక్తి కారు విండోలోంచి భుజం వరకు బయటకు పెట్టాడు. చేత్తో కౌశల్య మెడలోని చైన్‌ను లాగాడు. దీంతో ఆమె కిందపడిపోయింది. అయినా అతడు చైన్‌ను వదల్లేదు. ఆమెను కారుతో పాటే లాక్కెళ్లాడు. తాను కిందపడ్డా ఆమె మాత్రం చైన్‌ను వదల్లేదు. దీంతో చైన్ స్నాచర్‌ల ప్రయత్నం విఫలమైంది. వారు అక్కడినుంచి వెళ్లిపోయారు.
మహిళ రోడ్డుపై నుంచి లేచి నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. చైన్ స్నాచింగ్ ప్రయత్నంపై కేసు నమోదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్లరూపంలో తెలియజేయండి.
Trigger warning
CCTV footage of a chain snatching incident in Coimbatore which took place on Sunday. Culprits were caught near the Coimbatore airport today. pic.twitter.com/iucCfrg4fP— Akchayaa Rajkumar (@akchayaa_r) May 16, 2023