ఐపీఎల్ లో చాహల్ 2014లో ఆర్సీబీ జట్టులో చేరాడు. ఏడేళ్లుగా కోహ్లీ నాయకత్వంలో ఆడిన చాహల్ ఇప్పుడు కింగ్ కి షాకిచ్చాడు. మరి చాహల్ ఏ విషయంలో కోహ్లీ పట్ల అసంతృప్తిగా ఉన్నాడో చూద్దాం.
ఐపీఎల్ లో యుజ్వేంద్ర చాహల్ కి బెంగళూరు కి విడదీయరాని బంధం ఉంది. 2014 లో ఆర్సీసీబి జట్టులో తొలిసారిగా చేరాడు. అప్పట్లో చూడడానికి చాలా సన్నగా కనపడిన ఈ లెగ్ స్పిన్నర్ ని చూసి.. అందరూ ఎవడ్రా వీడు అనుకోని నవ్వుకున్నారు. కానీ అందరి అంచనాలను తల్లక్రిందులు చేస్తూ బెంగళూరు జట్టులో బెస్ట్ స్పిన్నర్ గా మారాడు. ఇక రాను రాను ఐపీఎల్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్పిన్నర్ గా రాటుదేలాడు. 2015 , 2016 సీజన్లలో 20 కి పైగా వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇక అప్పటినుంచి బెంగళూరు జట్టులో కీలక ప్లేయర్ గా మారిపోయాడు. దాదాపు ప్రతి సీజన్లో తనదైన బౌలింగ్ తో చెలరేగే చాహల్ 2021 ఐపీఎల్ లో నిర్వహించిన వేలంలో రాజస్థాన్ జట్టుకి వెళ్లాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఒక విషయంలో కోహ్లీ మీద చాహల్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తుంది.
ఐపీఎల్ లో గతేడాది కొత్తగా రెండు జట్లను చేర్చాలనే ఉద్దేశ్యంలో ప్లేయర్లందరిని మళ్ళీ కొత్తగా వేలంలోకి తీసుకొని వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక జట్టు అప్పటివరకు ఉన్న ప్లేయర్లలో గరిష్టంగా నలుగురు ప్లేయర్లను తీసుకోవాలి అనే నిబంధన వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆర్సీబీ టీమ్ విరాట్ కోహ్లీతో పాటు మ్యాక్స్ వెల్, సిరాజ్ లను తీసుకుంది. ఇంకో ప్లేయర్ ని తీసుకునే అవకాశమున్న ప్రధాన స్పిన్నర్ చాహల్ ని పక్కన పెట్టేసింది. దీంతో ఆక్షన్ లో చాహల్ ని రాజస్థాన్ జట్టు తీసుకుంది. ఇక తొలిసారి రాజస్థాన్ జట్టులోకి చేరి చాహల్ పర్పుల్ క్యాప్(అత్యధిక వికెట్లు తీసిన వారికి ఇచ్చే క్యాప్ ) అందుకున్నాడు.
సంజు శాంసన్ తన మీద ఎంతో నమ్మకముంచాడని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు చాహల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎల్ లో నా బెస్ట్ కెప్టెన్ సంజు శాంసన్ అని చెప్పుకొచ్చాడు. 2014 నుంచి 2020 వరకు ఆర్సీబీ జట్టుకి చాహల్ ఆడాడు. ఈ నేపథ్యంలో కోహ్లీని కాదని ప్రస్తుతం రాజస్థాన్ జట్టు కెప్టెన్ శాంసన్ కి ఓటేశాడు. కోహ్లీ గతంలో బెంగళూరు కెప్టెన్ కాగా… ప్రస్తుతం చాహల్ రాజస్థా జట్టుకి ఆడుతున్నాడు. మరి చాహల్ మనసులో ఏముందో తెలియదు కానీ.. 7 ఏళ్లుగా కోహ్లీ కెప్టెన్సీలో ఆడి.. సంజు శాంసన్ నా బెస్ట్ కెప్టెన్ అని చెప్పడం విశేషం. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.