గత కొంత కాలంగా దేశంలో మహిళలపై లైంగికదాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా.. కామాంధులు మాత్రం మారడం లేదు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారం, హత్యలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ర్టలతోని పూణేలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దర్శకుడు తననను బ్లాక్ మెయిల్ చేస్తూ ఐదేండ్లుగా లైంగిక దాడి చేస్తున్నాడని ఓ జూనియర్ నటిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళితే..
పుణెకు చెందిన ఓ యువతి సినీపరిశ్రమలో జూనియర్ నటిగా పనిచేస్తోంది. 2017 లో ఓ పార్టీలో దర్శకుడు అమిత్ ప్రేమ్ చంద్ సిత్లాని తో ఆ జూనియర్ ఆర్టిస్ట్ తో పరిచయం ఏర్పడింది. ఆ యువతికి సినిమాల్లో ఛాన్స్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తన స్నేహితుడి ఇంటికి రప్పించుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానని దర్శకుడు బెదిరించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
తనను బెదిరిస్తూ పలు మార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ నెల 26న కూడా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతో అతని వేధింపులు భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలిన మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఇది చదవండి: జనసేనలోకి మెగాస్టార్.. అభిమాని పోస్టుపై బండ్ల గణేష్ ట్వీట్..!
ఇది చదవండి: మెగా కోడలు ఉపాసనకి ‘నాట్‌హెల్త్ సీఎస్ఆర్’ అవార్డ్!