చటేశ్వర పుజారా.. నిన్న మొన్నటి వరకు ఇండియన్ టెస్ట్ జట్టు వాల్. అంతా పుజారాని ద్రావిడ్ కి రీప్లేస్ మెంట్ అన్నారు. అతని డిఫెన్స్ అద్భుతమని కీర్తించారు. కానీ.., సీన్ కట్ చేస్తే గడచిన రెండేళ్ల నుండి పుజారా టీమ్ కి భారం అయ్యాడు. తాజాగా లార్డ్స్ టెస్ట్ లో కూడా పుజారా దారుణంగా విఫలం అయ్యాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో కేవలం 9 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో.., ఇకపై పుజారాకి జట్టులో స్థానం దక్కడం అసాధ్యమన్న టాక్ వినిపిస్తోంది.
నిజానికి ఒక్క సీరిస్ లో విఫలం అయినందుకో, ఒక మ్యాచ్ లో విఫలం అయినందుకో పుజారాపై ఈ విమర్శలు రావడం లేదు. అతని గత రెండేళ్ల ప్రదర్శనని ప్రామాణికంగా తీసుకునే ఈ కామెంట్స్ చేస్తున్నారు. 2019 జనవరి 3వ తేదీన లో పుజారా చివరిసారిగా సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్ లో పుజారా మొత్తం 193 పరుగులు సాధించాడు. ఇక అక్కడ నుండి ఈనాటి వరకు నయా వాల్ సెంచరీ చేసింది లేదు. ఇక చివరి 10 ఇన్నింగ్స్ లలో పుజారా హయ్యెస్ట్ స్కోర్ 21. దీని ప్రకారం చూస్తే పుజారా పూర్తిగా ఫామ్ కోల్పోయాడని అర్ధం అవుతుంది.
మరోవైపు రాహుల్, అయ్యర్, పృథ్వి షా, మయాంక్ అగర్వాల్, విహారి, సూర్యకుమార్ యాదవ్ లాంటి క్రికెటర్స్ టెస్ట్ జట్టులోను శాశ్వితం స్థానం కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి సమయంలో పుజారాకి ఇక ఎన్నో అవకాశాలు దక్కకపోవచ్చన్న టాక్ నడుస్తోంది. ఇంగ్లాండ్ పరిస్థితుల దృష్ట్యా.. అనుభజ్ఞుడైన పుజారాకి మూడో టెస్ట్ లో కూడా స్థానం దక్కొచ్చు. ఒకవేళ అప్పుడు కూడా విఫలం అయితే ఇక పుజారా టీమ్ ఇండియాలో కొనసాగడం దాదాపు అసాధ్యమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.