దేశంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిల కనీస వివాహ వయసు కూడా 21ఏళ్లు ఉండాలనే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు దేశంలో అమ్మాయిల వివాహ వయసు 18 ఏళ్లు కాగా అబ్బాయిల వయసు 21. కొన్నేళ్లుగా ఈ వ్యత్యాసం పై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిల వయసు తక్కువగా ఉండడం వలన వారి కెరీర్ తో ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు వాదించాయి.
ఈ నేపథ్యంలో కేంద్రం పెళ్లి కోసం అమ్మాయిల కనీస వయసు కూడా 18 నుంచి 21ఏళ్లకు పెంచాలని నిర్ణయించింది. ఈ ఆమోదం వెనుక కేంద్రం చాలా కసరత్తే చేసింది. ప్రధాని మోడీ ఆదేశాల మేరకు.. గతేడాది జూన్ లో నీతి ఆయోగ్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయగా.. సభ్యులు దేశమంతా సర్వే నిర్వహించి కేంద్రానికి నివేదిక సమర్పించారు. తక్కువ వయసులో పెళ్లిళ్ల కారణంగా జరిగే నష్టాలను అంచనా వేసి పలు ప్రతిపాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే 21 ఏళ్ల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఈ నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.