పశువుల పాకలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పాపం కట్టేసి ఉన్న జీవాలు బయటకు రాలేక మంటల్లో కాలిపోయాయి. కొన్ని పశువులు కాలిన గాయాలతో బయటపడ్డాయి. వాటిని చూస్తే కంట్లో గిర్రున నీళ్లు తిరగటం ఖాయం. అయ్యే పాపం అనేలా ఉన్నాయి ఆ దృశ్యాలు. అవనిగడ్డ మండలంలోని కొత్తపేటలో ఈ దారణ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన ఏసుబాబు పశువుల పాకలో అగ్నిప్రమాదం సంభవించి రెండు గేదెలు సజీవదహనం అయ్యాయి. మరి కొన్ని తీవ్రగాయాలతో బయటపడ్డాయి. ఏసుబాబు కుటుంబానికి ఆధారమైన పశువులు మృతి చెందడంతో ఆ కుటుంబసభ్యుల రోదనలు విన్నంటాయి. వారి ఆవేదనను, కాలిన గాయాలతో ఉన్న పశువులను చూస్తున్న అక్కడి వారు కన్నీరుపెట్టారు.