స్పోర్ట్స్ డెస్క్- గోవాలో ఎంతు కట్లెట్స్ – పంజిమ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ మాస్టర్స్ కోసం సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో తెలుగు ఆటగాడు సత్తా చాటాడు. ఆగస్ట్ 12 నుంచి 15వ వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 100 మంది సీనియర్ ప్లేయర్లు పాల్గొన్నారు.
ఇందులో అటామిక్ బ్లాస్టర్స్ టీమ్ తరపున ఆడిన హైదరాబాదీ ప్లేయర్ ముప్పాల వేణు, కర్నాకట ప్లేయర్ జయశ్రీ.. మిక్స్‌డ్ డబుల్స్‌లో బ్రాంజ్ మెడల్ దక్కించుకున్నారు. లీగ్ నుంచి క్వాలిఫైయింగ్ వరకూ గట్టిపోటీని ఇచ్చిన ఈ జోడీ తృటిలో ఫైనల్స్ లో ఆడే ఛాన్స్ మిస్ అయింది. బ్రాంజ్ కోసం జరిగిన మ్యాచ్ లో రాయల్ లయన్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికి వేణు ముప్పాల అద్వితీయమైన ఆటతో తమ టీమ్ కి బ్రాంజ్ మెడల్ సాధించాడు.
గోవాలోని ఎంతు కట్లెట్స్ నిర్వహించిన ఈ బ్యాడ్మింటన్ పోటీల్లో వరుసగా రెండోసారి కూడా మెడల్ గెలవడం ఆనందంగా ఉందన్నాడు ముప్పాల వేణు. గోవాలోని మపూసా ఎస్ఏజీ స్టేడియంలో ఈ పోటీలు జరిగాయి. పూర్తిస్థాయి కోవిడ్ నిబంధనలతో జరిగిన ఈ ఆటల్లో రెండు డోసుల పూర్తి వ్యాక్సినేషన్ ఉన్న వాళ్లకే ఆడేందుకు అనుమతినిచ్చారు.