స్పెషల్ డెస్క్- పెళ్లి వేడుక అంటేనే సరదా సందడి. బంధువులు, స్నేహితులతో అంతా హంగామా ఉంటుంది. ఆటపట్టించడాలు, నవ్వులు, అలకలు అబ్బో చాలానే ఉంటాయి పెళ్లిలో. ఐతే సర్వసాధానరణంగా పెళ్లిలో పెళ్లి కూతురు మాత్రం కాస్త సిగ్గు పడుతూ రిజర్వ్ డ్ గా ఉంటుంది. ఈ కాలంలో ఐతే పెళ్లి కూతురు సైతం ప్రీగానే ఉంటుందనుకొండి. ఎంత ప్రీగా ఉన్నా, సిగ్గు పడుతూ పద్దతిగా ఉండటం మన సంప్రదాయం కదా.
కానీ ఇక్కడ ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురు చేసిన పనికి అంతా నివ్వేరైపోయారు. అసలేం జరుగుతోందో తెలియక ఓ దశలో కంగారు పడిపోయారు. ఇక పెళ్లి కొడుకు సంగతి చెప్పక్కర్లేదు. అలా పెళ్లి కూతురునే చూస్తూ అండిపోయాడు. ఐతే తరువాత తేరుకున్నాడనుకొండి. అసలేం జరిగిందంటే.. ఓ పెళ్లి మండపంటోల అట్టహాసంగా పెళ్లి వేడుక జరుగుతోంది.
వేద పండితుడు పెళ్లి మంత్రాలు చదువుతున్నాడు. ఆహుతులంతా ఆసక్తిగా పెళ్లి తతంగాన్ని చూస్తున్నారు. వధువు మెడలో తాళి బొట్టు కట్టాలని పండితుడు పెళ్లి కొడుకుకు చెప్పాడు. అతను తాళిని తీసుకుని పెళ్లి కూతురు మెడలో కట్టబోతుండగా.. హఠాత్తుగా ఆమె పెళ్లి పీటలపై నుంచి లేచింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ ముందుకు వెళ్లిపోయింది. దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో నిశ్సబ్దం అలుముకుంది.
దీంతో పెళ్లికి వచ్చిన చుట్టాలంతా అవాక్కైపోయారు. అసలేం జరుగుతుందో ఒక్క క్షణం ఎవ్వరికి అర్ధం కాలేదు. ఇక పెళ్లి కొడుకు సంగతి మరీ దారుణంగా ఉంది. పెళ్లి కూతురు హఠాత్తుగా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని వెళ్లిపోయే సరికి ఏంచేయాలో తెలియక అలానే చూస్తూ ఉండిపోయాడు. కానీ అంతలోనే పెళ్లి కూతురు నవ్వుతూ తిరిగి వెనక్కి వచ్చేసింది. ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అవును పెళ్లి కూతురు నిజంగా పెళ్లి ఇష్టం లేక వెళ్లలేదు. కాసేపు అందరిని సరదాగా ఆటపట్టిద్దాం అని అలా చేసందట.
అచ్చు సినిమాల్లోలా చేయాలని ఎప్పటి నుంచో ఆమెకు కోరిక ఉండేదట. అందుకే తన పెళ్లి వేడుకలో ఇలా అందరిని ఆటపట్టించింది. విషయం తెలిసాక అంతా రిలాక్స్ అయ్యారు. కానీ పాపం పెళ్లి కొడుకు తేరుకునే సరికి చాలా సమయం పట్టింది. ఇక ఈ తతంగాన్నంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో బాగా వైరల్ అవుతోంది.