స్పెషల్ డెస్క్- ఈ మధ్య కాలంలో పెళ్లి వేడుకల్లో భలే సరదా సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి అంటేనే సరదా, సందడి అనుకోండి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా బాగా యాక్టీవ్ గా ఉండటంతో, వివాహ వేడుకల్లో ఏంజరిగినా వెంటనే అందరికి చేరుపోతోంది. ప్రధానంగా వివాహ వేడుకలో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం, వధూ వరులను ఫ్రెండ్స్ ఆటపట్టించడం వంటి సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి సన్నివేశాలను చూసేందుకు నెటిజన్లు చాలా బాగా ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఓ క్రిస్టియన్ వివాహ వేడుకకు సంబంధించిన ఓ స్పెషల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. చర్చిలో పెళ్లి తంతు ముగిసిన తరువాత పెళ్లి కొడుకుకు, పెళ్లి కూతురు ముద్దు పెట్టింది. దీనికి షాక్ అయిన వరుడు వెంటనే వెనక్కి పడిపోయాడు. ఐతే అతను పడిపోతుంటే వెనకే ఉన్న అతని స్నేహితులు అతడిని కింద పడకుండా పట్టుకుని మళ్లీ యధావిధిగా నిలబెట్టారు.
అసలేంజరిగిందో అని కంగారు పడ్డ పెళ్లి కూతురు, ఆ తరువాత అతను కావాలనే అటపట్టించేందుకు అలా చేశాడని తెలుసుకని సిగ్గుపడింది. ఇక మిగతా బంధువులు, స్నేహితులు ముసి ముసి నవ్వులు నవ్వుకున్నారు. ఇక ఈ సన్నీవేశాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేసెయ్యండి.