స్పెషల్ డెస్క్- మొగుడు, పెళ్లాం అన్నాక సరదాలు, అలకలు, పట్టింపులు, గిల్లి కజ్జాలు.. అబ్బో ఇలా చాలా ఉంటాయి. ప్రపంచంలో అతి ఎక్కువ భావోద్వేగాలు కేవలం భార్యా భర్తల మధ్యే ఉంటాయని ఓ మానసిక నిపుణుడు చెప్పారు. అవును మరి జీవితంలో ఒకరికి ఒకరుగా, జీవితాంతం కలిసి ఉండే వారు కాబట్టి, మొగుడు, పెళ్లాం మధ్య చెప్పలేనన్ని ఉంటాయి.
ఇక పెళ్లి సందర్బంగా అనుకోకుండా జరిగే సరదా సన్నివేశాలు జీవితంలో ఎల్లవేలలా గుర్తుంటాయి. స్నేహితులు ఆటపట్టించడం, కొన్ని సందర్బాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురును టీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇదిగో ఓ వివాహ వేడుకలో వరుడు, వధువు మధ్య జరిగిన సరదా సన్నివేశాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఓ పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురుకు సంబందించిన ఫోటో షూట్ జరుగుతోంది. ఆ సమయంలో పెళ్లికొడుకు కూర్చీపై కూర్చుని ఉండగా, పెళ్లి కూతురు అతని కుర్చీ పక్కనే నేలపై కూర్చుంది. ఈ క్రమంలో వధువు తన పక్కనే ఉన్న అరటి పండును తీసుకుకుని తినేందుకు రేడీ అయ్యింది. ఐతే వెంటనే పెళ్లికొడుకు మాత్రం ఆమె తినబోతున్న ఓ అరటి పండును లాక్కుని తినేశాడు. కొత్త పెళ్లి కూరుతు ముందు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
సరేలే అని పెళ్లి కూతురు మరో అరటి పండు తీసుకుని తినబోతుండగా, యధావిధిగా పెళ్లి కొడుకు దాన్నీ కూడా చేతులోంచి లాక్కుని తినేశాడు. ఈ సారి మాత్రం పెళ్లి కూతురుకు చిర్రెత్తుకొచ్చింది. కానీ పెళ్లి మండపంలో తన కోపాన్ని ప్రదర్శించలేదు కదా. అందుకే అప్పుడే తాళి కట్టిన భర్తవైపు కాస్త చిరాకు ప్రదర్శించింది. కానీ పెళ్లికోడుకు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా అరటిపండ్లు తింటూ ఉన్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.