జమ్మూ కశ్మీర్- పెళ్లి.. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో పెళ్లికి ఎంతో ప్రాధాన్యత ఉంది. భారతీయుల జీవితంలో పెళ్లి ఓ అపురూపమైన ఘట్టం. ఎందుకంటే పెళ్లి జీవితంలో ఒకేసారి జరిగే అరుదైన, అందమైన కార్యం. ఇక పెళ్లిలో అప్పగింతలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పెళ్లిలో ఎంతో సంతోషంగా గడిపే వధువు, అప్పగింతల వరకు వచ్చే సరికి దుఖం తన్నుకొస్తుంది.
పెళ్లికూతురుతో పాటు, ఆమె తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకోవడం, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో బాబూ అంటూ అల్లుడికి జాగ్రత్తలు చెప్పడం, కూతురు వెళ్లే మెట్టినింటి వారికి బాగా చూసుకోమని విన్నపాలు చేయడం.. అబ్బో చాలా తతంగం ఉంటుంది. కానీ ఇదంతా ఒకప్పుడు అనుకొండి. ఎందుకంటే ఇప్పటి తరం యువతులు గతంలోలా లేరనుకొండి. అప్పగింతల సమయంలో ఏ మాత్రం ఆందోళన చెందటం లేదు.
ఈ తరం అమ్మాయిలు ఎంతో సంతోషంగా అత్తారింటికి వెళ్తున్నారు. పెళ్లి తంతు ముగిశాక.. ఎంచక్కా అమ్మా నాన్నలతో పాటు బంధువులందరికి బైబై చెబుతూ వెళ్తున్నారు. తాజాగా ఓ పెళ్లికూతురు తన భర్తను కారులో ఎక్కించుకుని రాత్రి వేళ తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ అత్తారింటికి వెళ్లి ఆశ్చర్యపరిచంది. కొత్త పెళ్లి కూతురు ఏ మాత్రం తొణకకుండా, బెణకకుండా భర్త వెంటరాగా తొలిసారిగా అత్తారింట్లో కాలు పెట్టింది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. బాధపడుతున్న తల్లిదండ్రులకు కొత్త పెళ్లి కూతురే ధైర్యం చెప్పింది. ఆమె చొరవకు, దైర్యానికి ముందు ఆశ్చర్యపోయిన బంధువులు ఆ తరువాత కొత్త ట్రెండ్ సృష్టించావంటూ ఆమెను పొగడ్తలలో ముంచెత్తారు. కశ్మీర్‌లో బారాముల్లా జిల్లాలో ఆగస్టు 24న జరిగిన ఈ వివాహ వేడుకకు సంబందించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A bride driving herself with the groom to her in-laws. #KhudkafeelKashmir pic.twitter.com/lwRRy4QRw5
— Ahmed Ali Fayyaz (@ahmedalifayyaz) August 24, 2021