ఇండియా బాక్సర్ పూజా రాణి విజయం సాధించింది. అదీ మామూలుగా కాదు. 75 కిలోల విభాగంలో భారత క్రీడాకారిణి పూజా రాణి పసిడి పతాకాన్ని అందుకుంది. ఫైనల్‌లో ఉజ్బెకిస్తాన్ బాక్సర్ మావ్లోనోవాపై 5-0తేడాతో పూజారాణి విజయం సాధించింది. ఈ ఛాంపియన్‌షిప్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 2019 ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో సైతం పూజారాణి 81 కేజీల విభాగంలో స్వర్ణం గెలుచుకుంది. ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించింది. ఆరో గోల్డ్ వేటలో లెజెండరీ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఫెయిలైన చోట పూజా తన పంచ్ పవర్ చూపెట్టింది. తిరుగులేని పెర్ఫామెన్స్‌తో ప్రత్యర్థిని చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచింది. ఏషియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్ పూజా రాణి మరోసారి మెప్పించింది. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. బై, వాకోవర్‌తో నేరుగా ఫైనల్‌కు వచ్చిన పూజ ఈ చాన్స్‌ను అద్భుతంగా ఒడిసిపట్టుకుంది.
ఈ పతకంతో పాటు ఆమెకు రూ.7.23 లక్షల(10వేల డాలర్లు)ను బహుమానంగా అందుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన మల్వుడా మొవ్లొనోవాను 5-–0తో చిత్తు చేసి టోక్యో ఒలింపిక్స్‌కు ముందు కాన్ఫిడెన్స్ పెంచుకుంది. పూజా ధాటికి ప్రత్యర్థి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. సెమీస్‌లో లండన్ ఒలింపిక్స్ మెడలిస్ట్ వొల్నోవాను ఓడించి ఫైనల్‌కు వచ్చిన మల్ముడా ఇండియా బాక్సర్ స్పీడ్‌ను అందుకోలేక, పవర్ఫుల్ పంచ్‌లకు ఉక్కిరిబిక్కిరైంది. చాలా తెలివిగా ఆడిన పూజా ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టి క్రమం తప్పకుండా పంచ్‌లు కొట్టింది. దాంతో, మెగా టోర్నీలో వరుసగా రెండో గోల్డ్ ఓవరాల్‌గా నాలుగో మెడల్ కైవసం చేసుకుంది.