హెల్త్ డ్రింక్స్ అనగానే గుర్తుకు వచ్చేది హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, బోర్నవిటా. ఈ నాలుగు ఉత్పత్తులకు దేశంలో చాలా కాలం నుండి మంచి మార్కెట్ ఉంది. యితే ఇటీల కొంత మంది సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. రివ్యూలు ఇస్తూ ఫేమస్ అవుతున్నారు. అటువంటి ఓ వ్యక్తికి షాక్ ఇచ్చిందో సంస్థ.
మనకు హెల్త్ డ్రింక్స్ లేదా ప్రొడక్ట్స్ అనగానే గుర్తుకు వచ్చేది హార్లిక్స్, బూస్ట్, మాల్టోవా, బోర్నవిటా. ఈ నాలుగు ఉత్పత్తులకు దేశంలో చాలా కాలం నుండి మంచి మార్కెట్ ఉంది. అంతేకాకుండా ఇవి లేకుండా నేడు పిల్లలు పాలు కూడా తాగడం లేదు. ఇవి శరీరానికి పౌష్టికాహారాన్ని అందిస్తాయని భావించి వీటిని తల్లిదండ్రులు ఇస్తున్నారు. అయితే ఇటీల కొంత మంది సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఓ ప్రొడక్టును తీసుకుని అది ఆరోగ్యానికి మంచిదా కాదా, శరీరానికి హానీ చేస్తుందా అంటూ తెలిసి తెలియని జ్ఞానంతో రివ్యూలు ఇస్తున్నారు. వాటి రివ్యూలను చూసి గుడ్డిగా నమ్మినవారు వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. తాజాగా ఓ కంపెనీ కూడా ఇటువంటి సమస్యే ఎదురైతే.. వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బోర్నవిటా పేరుతో మోండలెజ్ ఇండియా సంస్థ ఏళ్లుగా హెల్త్ డ్రింక్‌ను విక్రయిస్తోంది. అయితే, తనకు తాను న్యూట్రిషియనిస్ట్‌గా, హెల్త్ కోచ్‌గా పేర్కొనే రేవంత్ హిమంత్సికా అనే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ బోర్నవిటాపై ఇటీవల ఓ వీడియో చేశాడు. ఈ హెల్త్ డ్రింక్‌లో అధిక స్థాయిలో షుగర్ కంటెంట్ ఉందని, కోకో పదార్థాలతో పాటు క్యాన్సర్ కారక రంగులను వినియోగించారని ఆరోపించాడు. ఇది పిల్లలకు ఇవ్వడం మానేయాలని, ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. హెల్త్ డ్రింక్‌లో అధిక మొత్తంలో షుగర్ కంటెంట్ ఉందంటూ వైరల్ అవుతున్న వీడియోపై ఆ కంపెనీ స్పందించింది.
ఈ వీడియోను ‘అశాస్త్రీయమైనది’అని, వాస్తవాలను వక్రీకరించి రూపొందించినట్లు పేర్కొంది. ఈ వీడియోపై సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు కంపెనీ ఈ నెల 13న లీగల్ నోటీసు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల రావడంతో అతడు ఈ వీడియోను తొలగించడం గమనార్హం. వీడియోను తొలగిస్తున్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సంస్థను కోరాడు. అప్పటికే ఈ వీడియో మిలియన్ల వ్యూస్ దక్కించుకుంది. నటుడు పరేశ్ రావల్, ఎంపీ కృతి ఆజాద్ వంటి వారు సైతం ఈ వీడియోను షేర్ చేయడం గమనార్హం. అయినప్పటికీ వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది.
గడిచిన ఏడు దశాబ్దాలుగా తాము నాణ్యత ప్రమాణాలకు కట్టుబడి, దేశీయ చట్టాలను గౌరవిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తులు తయారు చేస్తూ భారతీయుల విశ్వాసాన్ని చూరగొన్నామని పేర్కొంది. అత్యుత్తమ రుచి, ఆరోగ్యాన్ని అందించేందుకు పోషకాహార నిపుణులు, ఆహార శాస్త్రవేత్తల పర్యవేక్షణలో రూపొందిస్తున్నామని, తాము ఏయే పదార్థాలు వినియోగిస్తున్నామో స్పష్టంగా ప్యాకెట్‌పై పేర్కొంటున్నామని బోర్నవిటా పేర్కొంది. చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంటామని, ఈ నేపథ్యంలో వినియోగదారుల్లో ఓ వీడియో భయాందోళనలు రేకెత్తిస్తున్న వేళ.. ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. న్యాయపరంగానూ చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపింది.