ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూమారుడి వివాహ వేడుకలో ప్రముఖలు సందడి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు సందీప్, కదిరి బాలకృష్ణ కూతురు పూజిత వివాహం హైటెక్స్ లోని కన్వెన్షన్ సెంటర్ లో అంగరంగ వైభవంగా జరిగింది.బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహా వేడుకకు హాజరైన జగన్ దంపతులు వధూవరులను ఆశీర్వదించారు. వరుడు డాక్టర్ లక్ష్మీనారాయణ్ సందీప్, వధువు పూజితలకు శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి, బండ్ల గణేష్ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.
ఇది చదవండి: హిజాబ్ వివాదంపై సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు!
ఇక బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు ఆహ్వానం అందింది. దీంతో ఈటల ఈ వివాహానికి హాజరుకాగా స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆత్మీయంగా స్వాగతం పలికారు.ఈటలను కలవగానే ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని యోగక్షేమాలు అడిగారు. సందర్భంగా నూతన వధూవరులను నిండునూరేళ్లు చల్లగా బ్రతకాలంటూ అక్షింతలు వేసి ఆశీర్వదించారు ఈటల.ఇక తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏపి మంత్రి బొత్స ఇంట పెళ్లిసందడి కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతున్నాయి.