ఫిల్మ్ డెస్క్- హరిహర వీరమల్లు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా సినిమా. ప్రముఖ దర్శకుడు క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందనుంది. హరిహర వీరమల్లు తాజా షెడ్యూల్ వచ్చే ఏడాది 2022 జనవరి నుంచి మొదలవుతుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా అందాల భామ నిధి అగర్వాల్ ప్రధాన నటిస్తుండగా, మరో హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎంపిక చేశారు.
అయితే ప్రస్తుతం ఆమె మనీలాండరింగ్ఒ కేసులో ఇరుక్కుంది. దాన్ని పరిష్కరించుకోవడానికి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఈడీ ఆఫీస్ చుట్టూ తిరుగుతోంది. ఈ పరిస్థితుల్లో జాక్వెలిన్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో జాక్వెలిన్ స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీని ఎంపిక చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ లో చర్చ జరుగుతోంది.
నర్గీస్ ఫక్రితో డైరెక్టకర్ క్రిష్ సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది. నిజానికి నర్గీస్ ను టాలీవుడ్ కు పరిచయం చేయాలని చాలా మంది దర్శక, నిర్మాతలు ప్రయచ్నించారు. ఐతే అనివార్య కారణాల వల్ల అవేవి వర్కవుట్ కాలేదు. అంతే కాదు అల్లు అర్జున్ పుష్పలో నర్గీస్ ఫక్రితో ఓ ఐటం సాంగ్ చిత్రీకరించాలని అనుకున్నారట దర్శకుడు సుకుమార్.
మరేమైందో కాని ఆఖరి నిమిషంలో అనూహ్యంగా సమంతా ను ఎంపిక చేశారు. మొత్తానికి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో నర్గీస్ ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేసిందన్నమాట. ఐతే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.