అన్ని ధరలకు రెక్కలొచ్చాయి. ఉప్పు నుండి కందిపప్పు వరకు అన్ని నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి నిచ్చేనేస్తున్నాయి. అటు కూరగాయ ధరలు చూసి సామాన్యుడు భయపడుతున్నాడు. గతంలో 200 రూపాయలు తీసుకు వెళ్తే.. ఓ సంచి నుండా కూరగయాలు వచ్చేవి.
అన్ని ధరలకు రెక్కలొచ్చాయి. ఉప్పు నుండి కందిపప్పు వరకు అన్ని నిత్యావసర సరకుల ధరలు ఆకాశానికి నిచ్చేనేస్తున్నాయి. అటు కూరగాయ ధరలు చూసి సామాన్యుడు భయపడుతున్నాడు. గతంలో 200 రూపాయలు తీసుకు వెళ్తే.. ఓ సంచి నుండా కూరగయాలు వచ్చేవి. కానీ ఇప్పుడు రూ. 500 నోటు చెల్లించినా బ్యాగు సగం కూడా నిండటం లేదు. టమాటా, ఉల్లి, పచ్చి మిరపకాయలకే ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుదల మామూలే. ఇక పాలు, వంట నూనె ధరలు కూడా పైపైకి చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే టిఫిన్స్ రేట్లు పెరుగుతున్నాయంట. ఇది ఫలహార ప్రియులకు మింగుడుపడని అంశం.
ఇక బ్యాచులర్స్, స్టూడెంట్స్, ఎప్పుడైనా టిఫిన్స్ తినాలనుకున్న వాళ్లు ఇక నోరు కట్టుకోవాల్సిందే. ఎందుకంటే టిఫిన్స్ ధరలు పెరిగిపోయాయి. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలను హోటల్స్, రెస్టారెంట్లలో కొత్త చార్జీలు పుట్టుకొచ్చాయి. అవునండి ఆగస్టు 1 నుండి టీ దగ్గర నుండి టిఫిన్, స్నాక్స్ అన్ని ధరలు పెరగనున్నాయి. నిత్యావసర ధరలు పెరగడంతో టిఫిన్ ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సంఘం కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. వచ్చే నెల ఒకటో తేదీ నుండి లీటర్ పాలపై రూ. 3 రూపాయలు పెరగనున్న నేపథ్యంలో టీ, కాఫీ ధరలు కూడా పెరగనున్నాయి. స్నాక్స్ రూ.5. ఇక మధ్యాహ్న భోజనానికి రూ.10 పెరగనుంది.
ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ధరల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో రేట్లు ఛేంజ్ అయిన బోర్డులు దర్శనమిస్తున్నాయి. కాఫీ పొడి రేటు కూడా పెరగడంతో కాఫీ రూ.2, టీ మీద ఒక్క రూపాయి పెంచినట్లు తెలుస్తోంది. అలాగే రెస్టారెంట్లు, ఫైవ్ స్టార్ హోటల్స్‌లో కూడా టిఫిన్స్ రేట్లలో మార్పులు సంతరించుకున్నాయి. దీంతో టిఫిన్స్ చేద్దామని భావించి ప్రియులు ఇక ఒక్క ప్లేటుతో సరిపెట్టేసుకుంటారేమో చూడాలి. అధికారికంగా ఆగస్టు 1 నుండి ఈ ధరలు అమల్లో ఉండే అవకాశం లేకపోలేదు. ఇడ్లీ, పూరీ, గారె, వడ తినాలంటే ఆలోచించాల్సిందేనా? ఓ సమోసా, చాయ్ తో సరిపెట్టుకోవాలనుకున్నా బడ్జెట్ సరిపోవడం లేదనిపిస్తుందా. ఈ ధరల పెరుగుదలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.