Bigg Boss 6 Telugu: తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 6 ఆదివారం అట్టహాసంగా మొదలైంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. వీరిలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం 11 మంది అమ్మాయిలు ఉన్నారు. ఇక, మొదటి రోజు నుంచే బిగ్‌బాస్ తన ఆట మొదలెట్టాడు. టాస్క్‌లతో కంటెస్టెంట్లను రెచ్చగొడతున్నాడు. టాస్క్‌లు పక్కన పెడితే.. ఒకరితో మరొకరికి పొందక కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరగటం మొదలైంది. జబర్థస్త్ ఫేమ్ గీతూ రాయల్ సింగర్ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. బట్టల గదిలోకి వెళ్లిన గీతూ రేవంత్‌పై మండిపడింది. ‘‘ ఆయనపై ఒక రేంజ్‌లో అభిమానం ఉండేది నాకు ఆ రేవంత్‌పైన. కానీ, టాలెంట్ వేరే బిహేవియర్ వేరే, పర్సనాలిటీ వేరే’’ అంటూ ఏడ్చేసినంత పని చేసింది.
అంతకముందు గీతూ రాయల్, ఇనయా సుల్తానాతో గొడవపడింది. బాత్‌రూమ్‌లో పడిఉన్న జుట్టు విషయంలో ఇనయతో గొడవపెట్టుకుంది. ఇనయను ‘‘హలో తిక్కా.. నీకెట్టా’’ అని గీతూ తిట్టింది. దీంతో ఇనయ ‘‘ నాకుండే తిక్క నాకుందిలే ’’ అని సమాధానం ఇచ్చింది. ఇంతకీ గొడవ ఎలా మొదలైందంటే.. ‘‘ ఎవరీడ స్నానం చేసినోళ్లు.. ఫుళ్లు జుట్టుంతా ఉంది. ఎవరు తీస్తారు?’’ అని గీతూ అసహనం వ్యక్తం చేసింది. అప్పుడే పక్కనే ఉన్న ఒకరు ‘‘సుల్తానా’’ అని అన్నారు. గీతూ వెంటనే సుల్తానా దగ్గరకు వెళ్లింది. దాని గురించి అడిగింది. అప్పుడు సుల్తానా ‘‘ మనం అందరం డ్యూటీస్ ప్లాన్ చేసుకుందాం’’ అని అంది.
ఆ వెంటనే గీతూ ‘‘ నాకు బాత్‌రూంలు క్లీన్ చేసే డ్యూటీ ఇచ్చినా.. నేను వేరే వాళ్ల జుట్టు తియ్యను’’ అని స్పష్టం చేసింది. అప్పుడు సుల్తానా ‘‘నా హెయిర్ ఒకటే ఉందని గ్యారంటీ ఏంటి? నిన్న నైట్ చాలా మంది చేసుంటారు. వాళ్లదంతా ఉంటుంది. మీరెలా చెప్తారు నన్నే తియ్యమని చెప్పి’’ అని అంది. ఆ తర్వాత ‘‘ ‘‘హలో తిక్కా.. నీకెట్టా’’ అని గీతూ తిట్టింది. దీంతో ఇనయ ‘‘ నాకుండే తిక్క నాకుందిలే ’’ అని సమాధానం ఇచ్చింది. మరి, బిగ్‌బాస్ హౌస్‌లో గీతూ రాయల్ రేవంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Allu Arjun: గణేష్ నిమజ్జనంలో అల్లు అర్జున్, అల్లు అర్హ.. గణపతి బప్పా మోరియా అంటూ సందడి..