గడ్చిరోలి రూరల్- మహారాష్ట్రలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లాలోని ఎటపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్ కౌంటర్ తో మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 13 మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. పోటేగావ్, రాజోలీ మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో కమాండోలు ఆ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. ఆ గాలింపు చర్యల్లో ఓ గ్రామానికి సమీపంలో మావోయిస్ట్‌ల స్థావరాన్ని కనుగొన్నారు. ఐతే పోలీసులు రాకను గమనించి మావోయిస్టులు వారిపైకి కాల్పులు జరపాయి. పోలీసుల కాల్పుల్లో మొత్తం 13 మంది మావోయిస్ట్‌లు హతమయ్యారు.
వెంటనే అప్రమత్తమైన భద్రత బలగాలు ఎదురు కాల్పులు ప్రారంభించడంతో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. సంఘఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం, ఇతర వస్తువులు లభించగా, భద్రత బలగాలు వాటిని స్వాధీనం చేసుకున్నాయి. సమీప గ్రామంలో గురువారం రాత్రి గ్రామస్థులను కలిసిన మావోయిస్టులు తెల్లవారుజామున అక్కడ నుంచి వెళ్లాల్సి ఉంది. ఐతే అంతలోనే వారు ఊహించని విధంగా పోలీసులు మెరుపు దాడి చేశారు. కానీ పగటి పూట ఎన్‌కౌంటర్ జరిగిందని నక్సల్ రేంజ్ డీఐజీ సందీప్ పాటిల్ చెప్పడం ఆసక్తిరేపుతోంది. ఇప్పటివరకు 13 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పిన ఆయన, ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ప్రకటించారు.