ఫిల్మ్ డెస్క్- భీమ్లా నాయక్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా. వకీల్ సాబ్ బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ తో పాటు రానా దగ్గుబాటి కూడా భీమ్లా నాయక్ లో హీరోగా నటిస్తున్నారు.
ఇప్పటికే భీమ్లా నాయక్ మూవీ పోస్టర్స్, పవన్ కళ్యాణ్, రానా టీజర్స్, టైటిల్ సాంగ్ అందరిని ఆకట్టుకున్నాయి. అంతే కాదు ఇటీవల భీమ్లా నాయక్ నుంచి వచ్చిన.. అంత ఇష్టం.. లిరికల్ సాంగ్ అన్నీ వర్గాల ప్రేక్షకులకు బాగా నచ్చింది. సోషల్ మీడియాలో భీమ్లా నాయకు సినిమాకు సంబందించిన న్యూస్ బాగా ట్రెంట్ అవుతోంది.
ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా భీమ్లా నాయక్ నుంచి మరో టీజర్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు టీజర్ ను అద్భుతంగా కట్ చేస్తున్నారట. ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్, రానా కలిసి ఉండే సన్నివేశం ఉండబోతోందని సమాచారం. ఇక భీమ్లా నాయక్ లో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
భీమ్లా నాయక్ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. సాగర్ కే దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. భీమ్లా నాయక్ సినిమాపై ఎప్పటికప్పుడు భారీ అంచనాలు నెలకొంటున్నాయి. దిపావళికి వచ్చే టీజర్ కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.