డిజిటల్ క్రైం డెస్క్- సోనూసూద్.. కరోనా ఆపత్కాలంలో ఎక్కడ చూసినా ఈపేరే వినిపిస్తోంది. సామాన్యుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఆందరు సోనూసూద్ నే సాయం కోరుతున్నారు. ఆఖరికి జిల్లా కరెక్టర్లు సైతం సోనూసూద్ ను హెల్ప్ అడుగుతున్నారంటే ఆయన ఎంతలా సమాజ సేవ చేస్తున్నారో వేరే చెప్పక్కర్లేదు. ఇక తనను ఎవరు సహాయం కోరినా నేనున్నానంటూ వెంటనే స్పందిస్తున్నారు ఈ రియల్ హీరో. అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. దేశంలో ప్రతీ రోజూ ఏదో చోట.. ఎవరో ఒకరు.. సోనూసూద్ వల్ల సాయం పొందుతున్నారనడంలో ఎలాంటి అతిశకయోక్తి లేదు. ఇదిగో ఇటివంటి సమయంలో మానవతా ధృక్పథంతో సోనూసూద్ చేస్తోన్నసేవను కూడా కొందరు మోసగాళ్లు పక్కదారి పట్టిస్తున్నారు.
సోనూసూద్ పేరుతో తప్పుు ప్రచారాలు మొదలుపెట్టారు కేటుగాళ్లు. సెలబ్రిటీల పేర్లతో ఇలా మోసాలకు పాల్పడేవారిని మనం చాలానే సూశాం. కానీ మంచి పనికోసం పాటు పడుతున్న సోనూసూద్ విషయంలో ఇలా జరగడం కలకలం రేపుతోంది. తాజాగా ఈ సంఘటవెలుగులోకి వచ్చింది. నటుడు సోనూసూద్ ఫౌండేషన్ పేరుతో సోషల్ మీడియాలో ఓ నకిలీ ప్రచారాన్ని మొదలుపెట్టారు గుర్తు తెలియని మోసగాళ్లు. సోనూసూద్ పేరు, ఫొటోను వాడుకుంటూ కొందరు నకిలీ విరాళాలు సేకరిస్తున్నారు. ఇది నటుడు సోనూసూద్ కు చెందిన సంస్థ అని, కరోనా సమయంలో చాలా మందికి సాయం చేసేందుకు ఇలా విరాళాలు సేకరిస్తున్నామని ప్రచారం మొదలుపెట్టారు. అందులో ఏకంగా పేటీఎం నెంబర్ పెట్టి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఇది నిజమేమో అని నమ్మిన చాలా మంది తాము కూడా సోనూసూద్ సేవలో పాలు పంచుకోవాలన్న ఉద్దేశ్యంతో ఆ పేటీఎం నెంబర్ కు డబ్బులు కూడా పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఎలాగోలా ఈ విషయం సోనూసూద్ దృష్టికి వెళ్లింది. దీంతో వెంటనే తన అభిమానులను అప్రమత్తం చేశారాయన. తన ట్విట్టర్ ఖాతా ద్వార నకిలీ విరాళాలకు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌ను షేర్ చేశారు. హెచ్చరిక అనే క్యాప్షన్‌ను జోడించి.. అలా విరాళాలు సేకరిస్తున్న సంస్థకు తనకు ఎలాంటి సంబంధం లేదని అభిమానులకు సందేశం ఇచ్చారు. ఇలాంటి నకిలీ సంస్థలకు ఎట్టి పరిస్థితుల్లో విరాళాలు ఇవ్వవద్దని చెప్పారు. తాను ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడం లేదని అభిమానులను తేల్చి చెప్పారు. సో.. ఫ్రెండ్స్ సోనూసూద్ పేరుతో ఇలాంటి ప్రకటనలు వస్తే ఏమాత్రం నమ్మవద్దని మరిచిపోకండి.