సెల్ ఫోన్ ఎంత కొంప ముంచుతోంది. మొన్నటి మొన్న పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ.. ఖండాంతరాలు దాటి ప్రియుడ్ని కలిసేలా చేసింది. పబ్జీతో పరిచయమైన భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమికుడు సచిన్ కోసం నేపాల్ మీదుగా వచ్చేసింది సీమా అనే పాకిస్తాన్ మహిళ
సెల్ ఫోన్ ఎంత కొంప ముంచుతోంది. మొన్నటి మొన్న పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ.. ఖండాంతరాలు దాటి ప్రియుడ్ని కలిసేలా చేసింది. పబ్జీతో పరిచయమైన భారత్‌లోని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రేమికుడు సచిన్ కోసం నేపాల్ మీదుగా వచ్చేసింది సీమా అనే పాకిస్తాన్ మహిళ. నలుగురి పిల్లలతో కలిసి అతడి కోసం శాశ్వతంగా ఇక్కడకు వచ్చేసింది. అక్రమంగా దేశంలోకి చొరబడిన మహిళ.. తన దేశం వెళ్లనంటే వెళ్లనని మొరాయించుకుని కూర్చుంది. అయితే రంగంలోకి దిగిన ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేపట్టగా.. విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ అనుమానాలు ఏర్పడుతున్నాయి. ఆమెకు సచిన్ కన్నా ముందు పలువురితో పరిచయాలు ఉన్నాయని. ఇప్పుడు అటువంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది.
సీమా తరహాలోనే జూలీ కూడా. అయితే జూలీదీ బంగ్లాదేశ్. ఉత్తర ప్రదేశ్ మొరాదాబాద్‌కు చెందిన అజయ్‌కి జూలీకి ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. తన 11 ఏళ్ల కూతురు హలీమాతో కలిసి భారత్‌కు వచ్చి హిందూ మతంలోకి మారి అజయ్‌ను పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల తర్వాత కొడుకు అజయ్ తల్లి సునీతకు ఫోన్ చేసి పొరపాటున బంగ్లాదేశ్‌లోకి వచ్చేశానని, త్వరలో తిరిగి వస్తానని ఫోన్ చేసి చెప్పాడు. రెండు నెలలైనా గడుస్తున్నా అతడి నుండి సమాచారం రాలేదు. అయితే కొన్ని రోజులకు రక్తంతో తడిచిన కుమారుడి ఫోటో ఆమె ఫోన్‌కు కోడలు పంపడంతో భయాందోళన చెంది.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తల్లి సునీత చెబుతున్న వివరాల ప్రకారం..బంగ్లాదేశ్ నుండి వచ్చిన జూలీ తన కుమారుడ్ని పెళ్లి చేసుకున్న తర్వాత.. కొన్నాళ్లు సజావుగానే కాపురం చేసిందని, అయితే వీసా, పాస్ పోర్టు గడువు ముగుస్తుందని, వాటిని పునరుద్ధరించుకోవడానికి తాను స్వదేశానికి వెళ్లాలని భర్తను కోరింది. అయితే తన వెంట బంగ్లాదేశ్ బోర్డర్ వరకు రావాలని భర్త అజయ్‌ను అడగడంతో కాదనలేక వెళ్లాడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు. అక్కడకు వెళ్లాక.. పొరపాటున దేశంలోకి వచ్చేశానని, పది, పదిహేను రోజుల్లో తిరిగి వస్తానంటూ అమ్మకు ఫోన్ చేసి చెప్పాడు. రెండు నెలలు గడుస్తున్నా రాకపోగా.. ఈ ఫోటో రావడంతో తన కొడుకు ప్రమాదంలో ఉన్నాడని, అతడిని రక్షించి తనకు అప్పగించాలని పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాసింది.