స్పోర్ట్స్ డెస్క్- సాధారనంగా క్రికెట్ మ్యాచ్ లో మన ఫేవరెట్ ఆటగాడు రన్స్ చేస్తుంటే మంచి ఉత్సాహంగా ఉంటుంది. అదే ఫోర్లు, సిక్సులు బాదుతుంటే మనమే ఆట ఆడుతున్నట్లు ఫీల్ అవుతుంటాము. బ్యాట్స్ మెన్ సిక్స్ కొట్టినప్పుడల్లా అది బౌండరీ దాటి, గ్యాలరీలో పడుతుంటుంది. ఇదిగో ఇక్కడో క్రికెట్ మ్యాచ్ లో అలా గ్యాలరీలో పడిని బాల్ కాస్త విషాదానికి కారణమైంది.
అవును బిగ్ బాష్ లీగ్ 2021లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్ మన్ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా తీసుకుందామని భావించిన అభిమానికి తల పగిలింది. అతడికి పెద్ద ఎత్తున రక్తం కారడం ఈ ఘటన కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం పెర్త్ స్కార్చర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.
హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఆండ్రూ టై బౌలింగ్ లో బ్యాట్స్‌మన్ బెన్ మెక్‌డెర్మోట్ భారీ సిక్స్ కొట్టాడు. గ్యాలరీ లోకి వస్తున్న బంతిని ఒక అభిమాని ఉత్సాహంతో క్యాచ్ పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే బంతి దురదృష్టవశాత్తూ అతని తల బాగంలో కుడివైపు బలంగా ఢీ కొట్టింది. దీంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతని నుదుట నుంచి బాగా రక్తం కారడం ప్రారంభమవ్వడంతో, చూసిన తోటి ప్రేక్షకులు ఆందోళనకు గురయ్యారు.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మ్యాచ్ నిర్వాహకులు అతన్ని వెంటనే స్టేడియంలోని సర్జన్ రూమ్ కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనతో కాసేపు మ్యాచ్ కు బ్రేక్ పడింది. సదరు అభిమాని క్షేమంగా ఉన్నాడన్న విషయం తెలిసిన తరువాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది.
Lucky the fan on the hill is OK…
Because his missed catch has drawn blood 😳#BBL11 pic.twitter.com/X0MTmDp7a2
— 7Cricket (@7Cricket) December 14, 2021