ఫిల్మ్ డెస్క్- నందమూరి బాలకృష్ణ.. సినిమాల్లో నటించడమే కాదు.. ఆయనకు సాహిత్యంపై మక్కువ ఎక్కువ. మనకు నోరు తిరగని ఎన్నో పద్యాలను ఆయన అలవోకగా చేప్పేస్తుంటారు. పౌరాణిక చిత్రాల్లో బాలయ్య బాబు చెప్పే డైలాగ్స్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో వేరే చెప్పక్కర్లేదు. అన్నట్లు బాలకృష్ణ ప్రస్తుతం ఆహా లో అన్ స్టాపబుల్ షో చేస్తున్నట్లు సంగతి తెలిసిందే.
హోస్ట్ చేయడంలో కూడా తనది ప్రత్యేకమైన స్టైల్ అని ఈ షోతో ప్రూవ్ చేసుకున్న బాలకృష్ణ, తాజా ఎపిసోడ్‌లో మద్యంపై పద్యం పాడి అందరిని అబ్బురపరిచారు. మొన్నా మధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన.. పైసా వసూల్.. సినిమాలో.. మామా ఎక్ పెగ్ లా అని పాడి మద్యం ప్రియులను అట్రాక్ట్ చేసిన బాలకృష్ణ, తాజాగా మద్యంపై పద్యం పాడి అందరిని ఆశ్చర్యపరిచారు.
అన్ స్టాపబుల్ తాజా ఎపిసోడ్ లో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను ఇంటర్వూ చేసిన బాలకృష్ణ, మద్యంపై పద్యం పాడేసి అందరిచేత ఔరా అనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ ని ఓ నెటిజన్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది. సంక్రాంతి స్పెషల్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌లో.. లైగర్.. టీమ్ సందడి చేసింది.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మి ముగ్గురూ కలిసి అన్ స్టాపబుల్ షోలో బాలయ్య బాబుతో కలిసి ఎంజాయ్ చేశారు. లైగర్ సినిమా విషయాలు, షూటింగ్ సంగతులతో పాటు తమ తమ వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. మధ్య మధ్యలో తనదైన స్టైల్లో సెటైర్లు వేసి అందంరిని నవ్వించారు హోస్ట్ బాలకృష్ణ. ఈ క్రమంలోనే గుక్కతిప్పుకోకుండా, తడబడకుండా నటసింహం పాడిన ఈ మద్యం పద్యం ఆద్యంతం అందరిని ఆకట్టుకుంటోంది.
#HappyKanuma #JaiBalayya
కనుమ పండుగ శుభాకాంక్షలు pic.twitter.com/kKBVltSnjT— మాయాబజార్ 📣 (@rsloya3969) January 16, 2022