ప్రకాశం- సంక్రాంతి పండగ అంటే సందడే సందడి. సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నా, సంక్రాంతి పండగకు మాత్రం సొంతూరికి, లేదంటే అమ్మమ్మ ఊరికి వెళ్లాల్సిందే. అలా పల్లెటూరిలో జరుపుకుంటేనే అది సంక్రాంతి పండగ అవుతుంది. అచ్చు ఇలాగే అనుకున్నారో ఏమో గాని నందమూరి బాలకృష్ణ సైతం పల్లెటూరి బాట పట్టారు.
అవును బాలకృష్ణ తన సోదరి పురంధేశ్వరి, బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్లారు. ఈ సంక్రాంతి పండగ ఇక్కడే గడిపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తెల్లవారు ఝామున బాలయ్య అక్క, బావలతో కలిసి బోగి పండగ సందర్భంగా తెల్లవారుజామున బోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు.
బాలకృష్ణ తన చిన్నతనంలో ఎక్కువ భాగం కారంచేడులోనే గడిపేవాడని,సెలవుల్లో ఎక్కువగా ఇక్కడే ఉండేవాడని దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయో ఏమో గానీ, ఈ సంక్రాంతి పండగను అక్క పురంధేశ్వరి తో జరుపుకోవాలని భావించినట్లు తెలుస్తోంది.
అనుకున్నదే తడవుగా కారంచెడుకు చేరుకున్నారు బాలయ్య బాబు. ఇటీవల బాలయ్య బాబు నటించిన అఖండ సినిమా గురించి కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫేస్ బుక్‌లో అభినందిస్తూ పోస్ట్ చేశారు. బాలయ్య బాబు ఫ్యామిలీ, నారా వారి కుటుంబం అంతా అఖండ సినిమా సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.