క్రిస్మస్ పండుగ అయిపోయింది.. మరి కొద్ది రోజుల్లో 2021కి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరం 2022కి స్వాగతం పలకబోతున్నాం. గత రెండేళ్లుగా కోవిడ్ ప్రపంచాన్ని పీడిస్తోంది. మరి రానున్న కొత్త సంవత్సరం అయినా బాగుంటుందా.. అసలు వచ్చే ఏడాది ప్రపంచ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మరో సారి బల్గేరియన్ బ్లైండ్ బాబా వాంగా పేరు తెర మీదకు వచ్చింది. గతంలో చాలా సార్లు అంధురాలైన ఆమె తన అతీంద్రియ శక్తులతో అంచనా వేసి చెప్పిన చాలా విషయాలు అచ్చంగా జరిగాయి.
రెండో ప్రపంచ యుద్దం నుంచి 2004 సునామీ దాకా, అమెరికా ట్విన్ టవర్స్ కూల్చివేత నుంచి 2018నాటికి చైనా సూపర్ పవర్ అవుతుందనే అంచనాదాకా ఆమె చెప్పిన జ్యోస్యాల్లో దాదాపు 70 శాతం నిజమయ్యాయి. ఈ క్రమంలో రానున్న కొత్త సంవత్సరం గరించి బాబా వంగా జోస్యం ఎలా ఉంది అంటే..
2022లో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి. మన దేశంలో 50 డిగ్రీల వరకు చేరుకుంటుంది. అలానే కొత్త సంవత్సరంలో కూడా మిడతల దాడి కొనసాగనుందట. ఫలితంగా రైతులు తీవ్రంగా నష్టపోతారని బాబా వంగా అంచనా వేశారు.
ఏలియన్స్ భూమ్మీద దాడి చేయడం కోసం ప్రత్యేక ఆస్టారాయిడ్‌ను పంపుతాయని.. సెర్బియాలో కొత్త వైరస్ పుట్టుకొస్తుందని తెలిపారు. అలానే గతంలో సునామీ వస్తుందని బాబా వంగా అంచనా వేయగా.. అది నిజం అయ్యింది. అలానే 2022లో కూడా సునామీ రానుందని.. పలు ఆసియా దేశాల్లో తీవ్రమైన భూకంపాలు, భారీ వరదలు సంభవిస్తాయని చెప్పుకొచ్చారు. కొత్త సంవత్సరంలో ప్రజలు మరింత ఎక్కువగా టెక్నాలజీకి బానిసలు అవుతారని బాబా వంగా జోస్యం చెప్పుకొచ్చారు.