హెల్త్ డెస్క్- ఇన్నాళ్లు కరోనానే అనుకుంటే.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లు కూడా దాడి చేస్తున్నాయి. కరోనాతో ఇప్పటికే ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. దినికి తోడు ఇప్పుడు మరో రెండు వైరస్ లు విజృంబిస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ మన భారత్ లోనే ఎక్కవగా సోకుతుందని నిపుణులు గుర్తించారు. కరోనా బారిన పడి ఎక్కువ రోజులు ఆక్సిజన్ మీద ఉన్న రోగులకు బ్లాక్ ఫంగస్ సోకుతుందని గుర్తించారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ కేసులు నమోదు అయ్యాయి. అయితే బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి ఆయుర్వేద వైద్యులు ఓ శుభవార్త చెప్పారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో పాజిటివ్ పేషెంట్లకు, ఈఎన్‌టీ ఆస్పత్రిలో కరోనా నుంచి కోలుకుని బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్న రోగులకు అల్లోపతి ట్రీట్‌మెంట్‌తో పాటు ఆయుర్వేద మందుల్ని కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ ఫంగస్ వ్యాధిని ఆయుర్వేద మందులతో నియంత్రించడం సాధ్యమేనని తెలంగాణ ఆయుష్ విభాగం డైరెక్టర్ డాక్టర్ అలగు వర్షిణి తెలిపారు.
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ ప్రభావం తక్కువగానే ఉందని, ఇమ్యునిటీ బూస్టర్స్ ద్వారా దీన్ని నిరోధించ వచ్చని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో బ్లాక్ ఫంగస్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోందని, అలాంటి ప్రమాదకర వైరస్ ను సైతం ఎదుర్కొనే శక్తి ఆయుర్వేద మందులకు ఉందని వైద్య నిపుణులు చెప్పారు. బ్లాక్ ఫంగస్ కు ఆయుర్వేద మందుల ద్వార చికిత్స చేసేందుకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వైద్యుల బృందాల్ని నియమించారు. బ్లాక్ ఫంగస్ బారిన పడిన రోగుల బ్లడ్ షుగర్ లెవల్స్ లో తేడాలు ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. దీన్ని అదుపులోకి తీసుకురావడానికి ఆయుర్వేద మందులు ఉపయోగపడతాయని వారు తెలిపారు. ఒకవైపు అల్లోపతి చికిత్స కొనసాగిస్తూనే ఆయుర్వేద వైద్య చికిత్సలను కూడా అందించనున్నట్లు వైద్యులు చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రుల్లో ఈ మందుల్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.