సిద్దిపేట క్రైం- ఈ మధ్యకాలంలో జరిగే నేరాల్లో అక్రమ సంబందాలకు సంబందించిన ఘటనలే అధికంగా ఉంటున్నాయి. దీంతో చాలా కుటుంబాలు రోడ్డు పాలు కావడంతో పాటు కొంత మంది ప్రాణాలు సైతం బలవుతున్నాయి. సమాజంలో ఇలాంటి సంబందాల వల్ల ఎర్పడే పరిణామాలను చూసిన తరువాత కూడా ఎవరూ మారడం లేదు.
సిద్దిపేట జిల్లాలో ఓ వివాహిత, ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చర్చనీయాంశంగా మారింది. వరుసకు అల్లుడయ్యే యువకుడితో సంబంధం పెట్టుకున్న మహిళ వ్యవహారం చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగాళ్లపల్లి గ్రామానికి చెందిన 25 ఏళ్ల శిరీషకు అప్పటికే పెళ్లైంది. భర్తతో హాయిగా కాపురం చేసుకుంటున్న శిరీష తప్పు చేసి, ప్రాణాల మీదకి తెచ్చుకుంది.
ఇంటి పక్కనే ఉండే శ్రీకాంత్ శిరీషకు అల్లుడు వరుస అవుతాడు. తరుచూ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ క్రమంలో శిరీష, శ్రీకాంత్ మధ్య సంబంధం ఏర్పడింది. శిరీష భర్త శివ ఇంట్లో లేని సమయంలో ఆమె తన అల్లుడితో ఎంజాయ్ చేసేది. తరువాత కాలంలో కొన్నాళ్లు దూరంగా ఉన్న శిరీష, శ్రీకాంత్ లు మళ్లీ రహస్యంగా కలవడం మొదలుపెట్టారు. ఇటువంటి సయమంలో శివ పనిమీద వేరే ఉరుకు వెళ్తూ, రాత్రికి రావడం ఆలస్యమవుతుందని భార్యకు చెప్పివెళ్లాడు. ఇంకేముంది భర్త ఆలస్యంగా వస్తానని చెప్పడంతో వెంటనే శిరీష తన అల్లుడు శ్రీకాంత్‌కు కబురు పంపించింది. కాస్త చీకటి పడ్డాక శ్రీకాంత్ రహస్యంగా శిరీష గదికి వెళ్లాడు. ఇక ఇద్దరూ సరససల్లాపాల్లో మునిగిపోయారు.
శిరీష అత్తగారు వీరిద్దరి అలికిడి విని కిటికీలో నుంచి చూసి షాకైంది. వాళ్లిద్దరికి తగిన బుద్ధి చెప్పాలని భావించి తలుపు బయట గడియ పెట్టి చుట్టుపక్కల వారిని పిలిచింది. ఆమె గట్టిగా అందరిని పిలుస్తుండటంతో గదిలో ఉన్న శిరీష, శ్రీకాంత్ కు విషయం అర్దమైంది. బంధువుల ముందు, గ్రామస్థుల ముందు తమ పరువు పోతుందని భావించి గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి తలుపు తీసి చూసే సరికి ఇద్దరూ చనిపోయి ఉన్నారు.