ఆఫ్ఘనిస్తాన్ లో భయానక పరిస్థితిలు కొనసాగుతున్నాయి. మొత్తం దేశాన్ని తాలిబన్స్ తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో ప్రజలు ఒకప్పటి చీకటి రోజులను గుర్తుకి తెచ్చుకుంటున్నారు. దీంతో.., ఉగ్ర మూకల పంజాకి చిక్కిన తమ దేశంలో ఉండలేక, ఒకవేళ ఉన్నా.. ప్రాణాలతో ఎన్ని రోజులు ఉంటామో తెలియక ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇతర దేశాలకి వలస వెళ్ళడానికి ఎయిర్ పోర్ట్ లో పడిగాపులు కాస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ కి సముద్ర తీర ప్రాంతం లేదు. మిగిలిన సరిహద్దు మార్గాలన్నీ తాలిబన్స్ ఆధీనంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని కాబూల్ నుండి ఇతర దేశాలకి వెళ్లే విమానాలని ఎక్కడానికి ప్రజల మధ్య తొక్కిసలాట జరిగే పరిస్థితిలు తలెత్తాయి. ప్రస్తుతం అక్కడి ఎయిర్ బస్ లన్నీ.., ఇప్పుడు ఎర్ర బస్సు లను తలపిస్తున్నాయి. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే హృదయ విదారకమైన ఓ వీడియో బయటకి వచ్చింది. తాలిబన్ పాలనలో బతకడం కష్టం అని భావించిన ఆఫ్ఘన్ ప్రజలు అమెరికాకి వెళ్తున్న ఓ విమానాన్ని ఎక్కడానికి ప్రయత్నించారు. లోపల ఇక నిలబడటానికి కూడా స్థలం లేనంతగా జనం ఎక్కేశారు. కానీ., కొంత మంది అమాయకులు మాత్రం విమానం రెక్కల మాటు.., విమానం రూఫ్ టాప్ పైన అలానే నక్కి కూర్చున్నారు. అయితే.., విమానం పైకి ఎగిరిన తరువాత ఎయిర్ ఫోర్స్ కి తట్టుకోలేక వీరంతా ఒక్కొక్కరిగా కిందకి పడిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ దృశ్యాలన్నీ తాలిబన్స్ రాతి గుండెకి, ఒకప్పటి వారి రాక్షస పాలనకి నిదర్శనమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.