ఆసియాలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ థియేటర్ గా పేరొందిన V Epiq(వి ఎపిక్).. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో ఉందనే సంగతి తెలిసిందే. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్కువ సినిమా టిక్కెట్ ధరలను నిర్ణయించిన కారణంగా శనివారం నుండి థియేటర్ మూసివేయనున్నారు. 2019 ఆగస్ట్ 29న ఈ థియేటర్ ప్రభాస్ నటించిన సాహో సినిమాతో ప్రారంభమైంది. ఏపీ జగన్ ప్రభుత్వం నిర్ణయించిన తక్కువ సినిమా టిక్కెట్ రేట్లతో తాను నడపలేనని ఎగ్జిబిటర్ గ్రహించడంతో 656 సీట్లుండే థియేటర్ ఇప్పుడు మూతపడింది. సూళ్లూరుపేట మున్సిపాలిటీ కావడంతో మల్టీప్లెక్స్‌కు కనీస టిక్కెట్ ధర రూ.60, గరిష్ట ధర రూ.150గా నిర్ణయించారు.
ఈ V Epiq థియేటర్లలో కేవలం రెండు తరగతులు మాత్రమే ఉన్నాయి. 2019లో ఇది ప్రారంభమైనప్పుడే టిక్కెట్ ధరలు రూ.100, రూ.200 లుగా ఫిక్స్ చేశారు. గత రెండేళ్లుగా, కోవిడ్ కారణంగా పెద్ద సినిమాలు రిలీజ్ లేక ఈ మల్టీప్లెక్స్‌లో ఆక్యుపెన్సీ బాగా తగ్గింది. ప్రభుత్వం ఇంత తక్కువ టిక్కెట్ ధరలను నిర్ణయించడంతో, మేము నిర్వహణ ఖర్చులను కూడా భరించలేము” అని మల్టీప్లెక్స్ యాజమాన్యం తెలిపినట్లు సమాచారం. ఇలాంటి బిగ్ స్క్రీన్ కే మూతపడే పరిస్థితి వచ్చిందని జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేశారు.