టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ.. హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చేశాడు. ఆసియాకప్ లో వరస ఇన్నింగ్స్ లతో అభిమానుల్ని అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే హాంకాంగ్ టీమ్.. విరాట్ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది. ఇదే విషయాన్ని కోహ్లీ కూడా పంచుకున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆసియాకప్ ప్రారంభానికి ముందు విరాట్ బ్యాటింగ్ పై అభిమానులు చాలా ఆందోళన చెందారు. కానీ పాకిస్థాన్ తో మ్యాచ్ లో 35 పరుగులు చేసి టచ్ లోకి వచ్చినట్లు కనిపించాడు.
హాంకాంగ్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో మాత్రం హాఫ్ సెంచరీ కొట్టిన కోహ్లీ.. ఫ్యాన్స్ ని ఫుల్ గా ఎంటర్ టైన్ చేశాడు. కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడిన విరాట్.. తర్వాత వేగం పెంచాడు. 3 కాన్ఫిండెంట్ సిక్సులు కొట్టి ఔరా అనిపించాడు. 59 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో మ్యాచ్ పూర్తయిన తర్వాత హాంకాంగ్ టీమ్ కోహ్లీ.. తమ జట్టు జెర్సీనీ బహుమతిగా ఇచ్చింది.
హాంకాంగ్ కెప్టెన్ కి కోహ్లీ అంటే చాలా ఇష్టం. మ్యాచ్ కి ముందు ఇంటర్వ్యూలోనూ ఇదే చెప్పాడు. కోహ్లీ మునుపటిలా ఫామ్ అందుకుంటే చూడాలని ఉందని అన్నాడు. ఇక మ్యాచ్ అనంతరం.. కోహ్లీకి హాంకాంగ్ టీం తమ అధికారిక జెర్సీని గిఫ్ట్‌గా అందించింది. జెర్సీపై ఆ టీమ్ మంచి కోట్ కూడా రాసింది. ‘ఓ తరానికి ఇన్ స్పిరిషేన్ మీరు.. అందుకు ధన్యవాదాలు. మీరు మున్ముందు మరింత గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాలని ప్రేమతో హాంకాంగ్ టీమ్’ అని జెర్సీపై పేర్కొంది. ఇక కోహ్లీ తన ఇన్ స్టా స్టోరీలో ఈ జెర్సీ ఫొటోని పోస్టు చేసి ఇలాంటి మీ ఆదరాభిమానానికి నిజంగా ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు.
ఈ మ్యాచులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్.. 20 ఓవర్లలో 192 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బాగానే ఆడిన హాంకాంగ్ జట్టు.. 5 వికెట్ల నష్టానికి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. మరి హాంకాంగ్ టీమ్.. విరాట్ కోహ్లీకి ఇచ్చిన గిఫ్ట్ గురించి మీరేం అనుకుంటున్నారు. మీ అభిప్రాయాన్నికామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇది కూడా చదవండి: అంతా హార్దిక్ పాండ్యాని పొగుడుతున్నారు. కానీ.., అసలు హీరో కోహ్లీనే!