ఫిల్మ్ డెస్క్- అషు రెడ్డి.. ఈ బిగ్ బాస్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చాక అషూ రెడ్డికి మంచి క్రేజ్ వచ్చింది. ఈ క్రేజ్ ను ఏ మాత్రం తగ్గనీవ్వకుండా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హంగామా చేస్తుంటుంది అషూ రెడ్డి. అషు గ్లామర్ ఫొటో షూట్ లేని రోజంటూ లేదు అనేలా రోజుకో విధంగా సోషస్ మీడియాను హీటెక్కిస్తోంది.
తాజాగా బుల్లితెర యాంకర్ రవితో బైక్‌పై షికారుకు వెళ్లిన వీడియోను షేర్ చేస్తూ అషు పెట్టిన కామెంట్, దానిపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్న తీరు వైరల్ అవుతున్నాయి. యాంకర్ రవితో అషూ రెడ్డితి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇద్దరూ కలిసి హ్యాపీ డేస్ ప్రోగ్రాం వేదికపై హంగామా చేస్తుంటారు. తెర ముందే కాదు, తెరవెనుక కూడా అషుతో యాంకర్ రవికి మంచి రిలేషన్ షిప్ ఉంది.
ఈ క్రమంలోనే యాంకర్ రవి బైక్ ఎక్కిన అషు.. సిగ్నల్ క్రాస్ చేశాడే.. అంటూ ఓ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. మోడ్రన్ కల్చర్ ఉట్టిపడేలా స్టైలిష్ డ్రెస్సు వేసిన అషు రెడ్డి, యాంకర్ రవి బైక్ ను స్టైల్ గా ఎక్కి అందరిని అట్రాక్ట్ చేస్తోంది. ఈ వీడియోని తన ఇన్స్‌స్టాలో పోస్ట్ చేసిన అషూ రెడ్డి.. సిగ్నల్ క్రాస్ చేశాడే, ఇక మాకు ఫైన్ పడ్డట్టే.. అని కామెంట్ చేసింది.
హెల్మెట్ ధరించండి.. సేఫ్‌గా డ్రైవ్ చేయండి.. అని కూడా చెప్పింది అషూ రెడ్డి. ఇంకేముంది, నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో కామెంట్ చేస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పావ్.. హెల్మెట్ ధరించండం మస్ట్ అషు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, అషు వేసుకున్న డ్రెస్‌పై మరికొందరు కొంటె కామెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.