ఫిల్మ్ డెస్క్- అషు రెడ్డి.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులుకు ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ముందు టిక్ టాక్, ఆ తరువాత బిగ్ బాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అషు రెడ్డి. ఇక వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బోల్డ్ ఇంటర్వూ చేశాక అషు రెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. సోషల్ మీడియాలోను అషూ రెడ్డి చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తనదైన స్టైల్లో వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది అషూ రెడ్డి. తాజాగా పుష్ప సినిమాలో ఊ అంటావా మావ.. ఉఉ అంటావా మావ పాటకు అషూ రెడ్డి డ్యాన్స్ చేసింది. మాములుగానే మాస్ ప్రేక్షకులను ఈ పాట అమితంగా ఆకట్టుకుంది. మరి ఇక అషూ రెడ్డి డ్యాన్స్ చేస్తే ఇంకేలా ఉంటుంది చెప్పండి.
పుష్ప సినిమాలోని ఊ అంటావా మావ స్పెషల్ సాంగ్‌కి తనదైన శైలీలో స్టెప్పులేసి అలరించింది అషు రెడ్డి. పుష్ప సినిమాలోని ఊ అంటావా మావా.. పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఏ పంక్షన్‌లో చూసినా ఇదే పాట మారుమోగుతుంది. సోషల్ మీడియాలో అయితే ఇక చెప్పక్కర్లేదు. ఊ అంటావా మావ పాట ట్రెండింగ్‌గా మారింది. ఇదిగో ఇప్పుడు ఈ పాటకు అషురెడ్డి చిందులేసింది.
యూట్యూబ్ లో షేర్ చేసిన ఈ పాట టీజర్ తెగ వైరల్ అవుతుంది. బోల్డ్ అప్పీల్ తో అషు రెడ్డి చేసిన ఈ పాట ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు అషు రెడ్డి ఫుల్ సాంగ్ రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి పూర్తి సాంగ్ లో అషు రెడ్డి ఏ రేంజ్ లో పెర్ఫామెన్స్ చేసిందోనన్న ఆసక్తి కనిపిస్తోంది.