ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఎవ్వరికి అంతుబట్టని క్యారెక్టర్. ఒకప్పుడు టాలీవుడ్ నుంచి మొదలు బాలీవుడ్ వరకు టాప్ డైరెక్టర్ గా వెలుగొందిన వర్మ.. ఈ మధ్య చేసే పనులన్నీ కూడా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. సాధారనంగానే వివాదాస్పద దర్శకుడిగా పెరు తెచ్చుకున్న ఆర్జీవీ.. ఇప్పుడు మరింత సెన్సేషన్ క్రియోట్ చేస్తున్నారు. ఎదైనా ముక్కుసూటిగా మాట్లాడే రాంగోపాల్ వర్మ.. ఆ డోసును మరింత పెంచారు. ప్రధానంగా అమ్మాయిల అందచందాలను పొగడటంలో వర్మ చలరేగిపోతున్నారు.
ఇక ఆర్జీవీతో ఇంటర్వూ చేస్తే చాలు బాగా పాపులర్ అయిపోతామని చాలా మంది యూట్యూబ్ యాంకర్లు భావిస్తున్నారు. ఇందుకు కారణం అరియానా అని చెప్పవచ్చు. ఎందుకంటే వర్మను ఇంటర్వూ చేశాకే అరియానా పాపులర్ అయ్యింది. ఏకంగా బిగ్ బాస్ షోకు వెళ్లింది. ఆ తరువాత మరోసారి ఆర్డీవీని ఇంటర్వూ చేసిన అరియానా హంగామా అంతా ఇంతా కాదు. ఆ సందర్బంగా అరియానా సౌందర్యాన్ని వర్మ వర్ణించిన తీరు సంచలనంగా మారింది.
ఇదిగో ఇప్పుడు అరియానాను అనుసరిస్తోంది మరో యూట్యూబ్ యాంకర్ అషూ రెడ్డి. తాజాగా అషు రాంగోపాల్ వర్మను ఇంటర్వూ చేసింది. ఆమె వర్మను ఇంటర్వూ చేయడం ఏమో కానీ, ఆయన అషూ రెడ్డితో చేసిన వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ఇంటర్వూలో భాగంగా మోకాళ్ల పైకి బట్టలు వేసుకున్న అషూ రెడ్డి చైర్ పై కూర్చుని ఉండగా, ఆమెను నేలపై కింద కూర్చుని ఓ యాంగిల్ లో ఫోటో తీశారు వర్మ. అషూ రెడ్డి కూడా సిగ్గులొలకబోస్తూ కూల్ గా కుర్చీలో కూర్చుంది.
ఇక ఇందుకు సంబందించిన వీడియోను అషూ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇంకేముంది అషూను డిఫరెంట్ యంగిల్ లో ఫొటో తీస్తున్న వర్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటర్వూకు సంబందించిన వీడియో రాకముందే ఈ వీడియోను లీక్ చేయడం వర్మ స్ట్రాటజీలో భాగమేనని నెటినజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.