గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి యూనిఫాం, 4జీ సిమ్ కార్డులు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలకు ఒక్కోకరికి మూడు జతల యూనిఫాంను ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
నియోజకవర్గాల వారిగా యూనిఫాం క్లాత్ ను సరఫరా చేసే బాధ్యతలను రెండు సంస్థలకు అప్పగిస్తూ ఆదేశాలిచ్చారు. గ్రామ, వార్డు సచివాలయ సెక్రటరీలకు 4జీ సిమ్ కార్డులు అందించేందుకు 4 నెట్ వర్క్ లకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.