అమరావతి- కృష్ణా జలాల విషయంలో తెలగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదం చలరేగుతోంది. రెండు రాష్ట్రాలు ఒకరిపై ఒకరు కేంద్రానికి పిర్యాదు చేసుకున్నారు. ఏపీ ఏకంగా తెలంగాణపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య సంబందాలు దెబ్బతిన్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణకు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.
జగన్ ప్రభుత్వం ఓ సాఫ్ట్ వేర్ విషయంసో తెలంగాణకు సాయం అందించింది. నాడు నేడు సాఫ్ట్ వేర్‌ను తెలంగాణ వినియోగించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మన బడి, నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణలోని పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పన కోసం వినియోగించేకునేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో సాఫ్ట్‌వేర్‌ను తెలంగాణకు ఇచ్చేందుకు ఎన్వోసీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
వైఎస్ జగన్ సర్కార్ చేపట్టిన నాడు నేడు కార్యక్రమంపై దేశంలోని పలు రాష్ట్రాలుఆసక్తి చూపుతున్నాయి. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టీసీఎస్ రూపొందించిన నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను ఏపీ ప్రభుత్వం వినియోగించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసే ప్రతి వస్తువు నాణ్యతతో ఉండేలా, ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ని పనులు చేపట్టారు, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చయ్యాయి.. తదితర అంశాలన్నీ ప్రతి ఒక్కరికీ తెలిసేలా టీసీఎస్ సంస్థ ద్వారా ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా నాడు నేడు పథకాన్ని ఆ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇందుకు సంబంధించి నాడు నేడు సాఫ్ట్‌వేర్‌ను తాము కూడా వినియోగించుకుంటామని, దీనిపై అనుమతి ఇవ్వాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఏపీ విద్యాశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది.