ఈ సృష్టిలో ఎప్పుడూ కొత్తగా ఉండేది.. మనషుల్ని ఆశ్చర్యపరిచేది ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా ప్రకృతి. ఈ ప్రకృతిలో మనిషికి తెలియని, తెలుసుకోలేని వింతలు, విశేషాలు చాలా ఉన్నాయి. పకృతిలోని కొన్ని వింతలు మన కంట పడినపుడు ఆశ్చర్యం కలగక మానదు. సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత పకృతిలోని ఏదో ఒక వింత, విచిత్రమైన సంఘటన తరచుగా వైరల్‌గా మారుతూ ఉంది. తాజాగా, ఓ ఫొటో నెటిజన్ల బుర్రకు పదును పెడుతోంది. అది ఏంటా అన్నది కనుక్కోవటానికి బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు జనాలు. తాజాగా, ప్రముఖ ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ ఓ ఫొటోను తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ఇదేంటో కనుక్కోగలరా అంటూ ప్రశ్నించారు. ఆయన పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటి వరకు రెండు లక్షలకు పైగా వ్యూస్, వేలల్లో లైక్స్‌ను సంపాదించింది.
ఇక, ఆ పోస్ట్‌పై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు ‘‘భూల్ బలయా 2 సినిమాలో టబు కాలి వేళ్లలా ఉన్నాయి’’ .. ‘‘ వాటిని చూస్తే దెయ్యం కాలి వేళ్లలా ఉన్నాయి’’.. ‘‘ అవి చింపాంజి కాలి వేళ్లలా ఉన్నాయి’’.. ‘‘ అవి ఏలియన్ కాలి వేళ్లు’’ అంటూ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. కొంతమంది అవేంటో కనిపెట్టేశారు. అవి మష్‌రూమ్‌లు.. తెలుగులో వీటినే పుట్టగొడుగులు అంటారు. ఇవి ఫంగస్ కారణంగా ఏర్పడుతూ ఉంటాయి. వీటిలో తినటానికి పనికి వచ్చేవి కొన్నయితే.. మనషుల ప్రాణాలు తీసేవి కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పుట్టగొడుగుల్ని సాగు చేస్తున్నారు. మాంసాహారానికి ప్రత్నామ్నాయంగా వీటిని తింటున్నారు. మరి, కాలి వేళ్లలా ఉండి మనల్ని ఆశ్చర్య పరిచిన ఈ పుట్టగొడుగులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Can you guess what is this???? pic.twitter.com/7BbQjP0kH8
— Dr.Samrat Gowda IFS (@IfsSamrat) January 10, 2023