న్యూజిలాండ్‌తో ముంబై వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు కేవలం ఇద్దరికి మాత్రమే సాధ్యమైన ఫీట్‌ను సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లను పడగొట్టి టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే, ఇంగ్లండ్ బౌలర్ జిమ్‌లేకర్ సరసన నిలిచాడు.
ఈ రికార్డ్‌పై స్పందించిన అనిల్ కుంబ్లే.. అజాజ్ పటేల్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘అద్భుతంగా బౌలింగ్ చేశావ్.. టెస్ట్‌లో మొదటి రెండు రోజుల్లో ఈ ఫీట్ సాధించాలంటే చాలా ఎఫర్ట్ అవసరం.. వెల్‌కమ్ టూ ద క్లబ్’ అంటూ ట్వీట్ చేశాడు. భారత సంతతికి చెందిన పటేల్.. భారత్‌పైనే ఈ రికార్డు సాధించడం విశేషం. 47.5 ఓవర్లు వేసిన పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీసుకున్నాడు. 1956లో ఇంగ్లండ్ ఆటగాడు జిమ్‌లేకర్, 1999లో అనిల్ కుంబ్లే ఈ రికార్డును సాధించారు. వీరి తర్వాత మళ్లీ ఈ ఫీట్‌ను సాధించిన తొలి క్రికెటర్ అజాజ్ పటేల్ కావడం విశేషం. మరి అజాజ్ పటేల్ సాధించిన ఈ రికార్డ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Welcome to the club #AjazPatel #Perfect10 Well bowled! A special effort to achieve it on Day1 & 2 of a test match. #INDvzNZ
— Anil Kumble (@anilkumble1074) December 4, 2021