ప్రతి జీవిని ప్రేమించే గుణం అందరిలోనూ ఉండదు.సాటివారిని మనుషుల్లా చూడని నేటి కాలంలో ఇలాంటి వ్యక్తులు అరుదుగా చాలా అరుదుగా ఉంటారు ,ఈ రోజుల్లో చాలామంది పెంపుడు జంతువులను పెంచుకోవటం పరిపాటి.అలాగే ఒకాయన ఓ కుక్కని పెంచాడు ..విశ్వాసంగా ఎప్పుడూ కృతజ్ఞత గా ఉండేది ఎంతో ప్రాణంగా చూసుకునేవాడు.పెంపుడు జంతువులంటే చాలామందికి ప్రాణమన్న సంగతి తెలిసిందే కదా. వాటికి ఏ లోటు లేకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటారు.పెంపుడు జంతువుల్లో ఎక్కువగా కుక్కును పెంచుకునేందుకు ఇష్టపడతారు.దానికి ఏ చిన్న కష్టం వచ్చినా అల్లాడిపోతారు.
ఒకవైళ ఆపెంపుడు శునకం ప్రాణాలు విడిస్తే?ఇంకేమైనా ఉందా..గుండెలుపగిలేలాఏడుస్తారు.కొన్ని రోజులు బాధపడతారు..ఎంతవిచారించినా చనిపోయినది తిరిగి రాదని తెలిసి ఎవరి పని వాళ్లు చూసుకుంటారు.మహా అయితే ఏడాదికోరోజు ఫోటోకు దండవేసి నివాళులర్పిస్తారు. అయితే విడ్డూరంగా తాను ప్రాణంగా చూసుకుంటున్న శునకం చనిపోతే కుక్కపై ఉన్న అభిమానాన్ని ఆ యజమాని తన కృతజ్ఞతను ఎలా తెలియజేశాడో చదివితే ఆశ్చర్యంగా ఉంటుంది.అసలు వివరాలు తెలుసుకుందాం !
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామానికి చెందిన సుంకర జ్ఞానప్రకాశరావు అనే ఆయన అమితమైన ప్రేమతో ఓ కుక్కను పెంచుకున్నాడు. దానికి శునకరాజు అని పేరుపెట్టడమే కాకుండా కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. దురదృష్టవశాత్తు అది కొన్నాళ్ళకి చనిపోయింది.
అది ఈ లోకం విడిచి అయిదేళ్లయినా దాని జ్ఞాపకాల్లోనే జీవిస్తున్నాడు. ఆ బాధను తట్టుకోలేక ప్రతి సంవత్సరం దానికి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే తమ పెంపుడు కుక్క జ్ఞాపకాలను మరచిపోలేని జ్ఞానప్రకాశరావు దానికి ఏకంగా కాంస్య విగ్రహం చేయించారు.ఇలాంటి వ్యక్తులుచాలా అరుదుగాఉంటారు.ఇప్పుడు ఎదురుగా శునకరాజును చూసుకుంటూ మురిసిపోతున్నాడు .
శునకరాజు5వ వర్ధంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి, శాస్త్రీయంగా తన కుక్క ఆత్మకు శాంతి కలగాలని పండితుల చేత ప్రత్యేక పూజలు,పిండప్రదానం కూడా నిర్వహించారు. కుక్క విగ్రహాన్ని పూలతో అలంకరించి పూజ చేశారు. ఆ తర్వాత స్థానికులకు విందు భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ రోజులు తమ కుటుంబంతో కలిసి జీవించిన శునకరాజు ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
మన అనుకున్న వాళ్లు చనిపోతేనే ఆఖరి చూపు చూసేందుకు కూడా కనీసం జనాలు రావడం లేదు. అలాంటిది చనిపోయిన పెంపుడు కుక్కపై ఇంత ప్రేమ ప్రదర్శించడం నిజంగా విచిత్రంగానే ఉంది.ఎంతో ధనమున్నా చివరకు తీసుకు పోయేది ఏమీ ఉండదు,బతికినన్నాళ్లూ,అందరినీ ఆదరించి చూడటం,సాటి జీవాలను ప్రేమించటం అందరికర్తవ్యం.