తెలుగు బుల్లి తెర కామెడీ షో అనగానే ఠక్కున గుర్తుకు వచ్చేది జబర్థస్త్ షో. ఈ షోతో అనేక మంది తమ టాలెంట్ ను నిరూపించుకున్నారు. దీని ద్వారానే అనేక మంది ఫేమస్ అయ్యారు. సుధీర్ త్రయం, ఆది, అభి, ధన్ రాజ్, చమ్మక్ చంద్ర, అవినాష్, రాఘవ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది. అయితే ఈ షో తొలి నుండి మంచి పేరు తెచ్చుకున్న రాఘవపై కొత్త యాంకర్ సౌమ్యరావ్ ఓ వ్యాఖ్య చేసి హాట్ టాపిక్ అయ్యింది.
తెలుగు టివీ కామెడీ షో అనగానే గుర్తుకు వచ్చేది జబర్థస్త్. ఎన్నో ఏళ్ల నుండి బుల్లి తెరలో తిరుగులేని షోగా రాణిస్తుంది. ఇందులో ఎంతో మంది తమ టాలెంట్
ను నిరూపించుకున్నారు. దీని ద్వారానే అనేక మంది ఫేమస్ అయ్యారు. బలగంతో డైరెక్టర్‌గా నిరూపించుకున్న వేణు కూడా ఈ షోతో మంచి గుర్తింపు వచ్చింది.
అంతక ముందు కొన్నిసినిమాలు చేసినా రాని గుర్తింపు ఈ షోతోనే వచ్చిందని ఆయనే స్వయంగా వెల్లడించారు. వీరే కాకుండా సుధీర్, శ్రీను, ఆది, షకలక శంకర్, అభి అనేక మంది ఉన్నారు. అలాగే ఈ షోకు యాంకర్లుగా వ్యవహరించిన అనసూయ, రష్మిలకు కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా అనసూయ షూటింగ్‌లతో బిజీ కారణంగా ఈ షో నుండి తప్పుకుంది. ఇప్పుడు ఆమె ఫ్లేస్ లో బెంగళూరు బ్యూటీ సౌమ్యరావు వచ్చి చేరింది.
వచ్చిరాని తెలుగుతో మాట్లాడినా సౌమ్యలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. అయితే ఈ నటి ఈ షోలో ప్రముఖ టీమ్ లీడర్ రాకెట్ రాఘవపై ఎవ్వరూ అనని ఓ మాటను పుసుక్కున అనేసింది. సౌమ్యరావు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసిన ఆమె.. ఆసక్తికరమైన వీడియోలు అప్లోడ్ చేసి ఫాలోవర్స్‌ను పెంచుకుంటోంది. ఛానల్ పెట్టిన తక్కువ వ్యవధిలోనే ఆమెకు 25కె ఫాలోవర్స్ ఉన్నారు. అయితే గతంలో జబర్థస్త సెట్ లోపల ఎలా ఉంటుందనే వీడియోను పంచుకుంది ఈ పొడుగు సుందరి. అయితే ఈ వీడియోకు మంచి ఆదరణ రావడంతో.. ఇప్పుడు మరో వీడియోతో ముందుకు వచ్చింది. జబర్థస్త్ కోసం టీమ్స్ ఎలా రెడీ అవుతారు? స్కిట్లు ఎలా ప్రాక్టీస్ చేస్తారు వంటి విషయాలను పంచుకుంది. ఎవరెవరు ఏం చేస్తారు అనే విషయాలను పంచుకుంది.
ఆమె షూటింగ్ చేసే సమయానికి పలువురు టీమ్ సభ్యులు చీరలు కట్టుకుని కనిపించారు. నూకరాజు, రాకెట్ రాఘవ, పంచ్ ప్రసాద్, తదితరులు శారీలో కనిపించారు. మరికొంత మంది మామూలు క్యాస్టూమ్స్ లో ఉన్నారు. ముందుగా రాకెట్ రాఘవ టీమ్ తో మాట్లాడిన ఆమె.. అతడి గురించి చెబుతూ ‘రాఘవ చూడటానికి చాలా డిసెంట్ గా ఉంటాడు కానీ రసికుడు’అంటూ డైలాగ్ వేయగానే.. అక్కడే ఉన్న వారంతా నవ్వుకున్నారు. తర్వాత అందరి టీమ్ సభ్యుల దగ్గరకు వెళ్లి వాళ్ల శారీ గెటప్ లు వేసినపుడు ఎంత కష్టపడతారు, స్కిట్ ఎలా ప్రాక్టీస్ చేస్తారు వంటి విషయాలను అడిగి తెలుసుకుంది సౌమ్య. చివరిగా జడ్జి ఇంద్రజ వద్దకు వెళ్లింది. ఇంద్రజ తనకు సపోర్ట్ చేస్తుంటారని, తొలుత ఈ యాంకరింగ్ గందరగోళంగా అనిపించేదని, ఆ సమయంలో ఇంద్రజ ఓ అక్కలాగా సపోర్ట్ చేసిందని చెప్పింది. ఆమె వర్క్ విషయంలో చాలా డిడికేటెడ్ గా ఉంటుందని చెప్పుకొచ్చింది సౌమ్య.