ఫిల్మ్ డెస్క్- రష్మి గౌతమ్.. ఈ జబర్దస్త్ యాంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కేవలం జబర్దస్త్ ద్వారానే కాకుండా, ఇతరత్రా కార్యక్రమాలు, సినిమాల ద్వార రష్మి అందరిని అలరిస్తోంది. ఇక రష్మికి సామాదిక అంశాల పట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ అని మనందరికి తెలుసు.
చాలా రోజుల తరువాత రష్మీ వెండితెరపై వెలిగేందుకు సిద్దమవుతోంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో హీరోయిన్‌గా, చిరంజీవి భోళా శంకర్ సినిమాలో అతిథి పాత్రలో నటిస్తోంది రష్మి. ఇక రష్మీకి మూగజీవాలంటే ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఎక్కడైనా ఎవ్వరైనా సరే మూగజీవిని హింసిస్తున్నారని రష్మీకి తెలిస్తే వెంటనే రియాక్ట్ అవుతుంది. వీధిలో కనిపించే కుక్కలను రష్మీ పెంచుకుంటుంది.
ఇండియన్ బ్రీడ్‌ను పెంచుకోండి, వాటిని షాపుల్లో కొనకండి, ఎక్కడైనా కనిపిస్తే బయట దత్తత తీసుకోండని సలహా ఇస్తుంటుంది రష్మి. ఈ క్రమంలో రష్మీ ఓ వీడియోను చూసి చాలా బాధపడింది. ఢిల్లీ జూలో ఓ ఉద్యోగి, ఓ జంతువును అకారణంగా కొడుతూ కనిపించాడు. ఈ ఘటనపై రష్మీ చాలా సీరియస్ అయ్యింది. మిమ్మల్ని చూస్తే సిగ్గుగా ఉంది, అందుకే జూకు ఎవ్వరూ వెళ్లకండి, ఈ జంతువులను వారు అక్కడ ఎంతలా హింసిస్తున్నారో ఆలోచించండని కోరింగి.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మేనకా గాంధీ ఇలా ఈ ఇష్యూతో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరినీ ట్యాగ్ చేయండని రష్మీ వ్యాఖ్యానించింది. మనం మూడు నెలలు లాక్ డౌన్ లో ఉంటేనే మెంటల్ ఎక్కింది, ఈ జంతువులు జీవితాంతం అలా జూలోనే ఉంటాయి, ఇకపై వాటిని ఫ్రీగా ఉండనిద్దాం, ఆ జూల జైల్లో అవి ఎంత నరకాన్ని అనుభవిస్తాయో మీకు తెలియదు అని రష్మీ ఎమోషనల్ అయ్యింది. మీ పిల్లలను వినోదం కోసం జూకు తీసుకెళ్లకండని విజ్ఞప్తి చేసింది రష్మి.