ఫిల్మ్ డెస్క్- అనసూయ భరద్వాజ్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయక్కర్లేదు. బుల్లితెరపై ప్రసారం అయ్యే జబర్ధస్త్ కామెడీ షో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ, ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. జబర్దస్త్ షో ద్వార తనకంటూ ప్రత్యేక గుర్చింపు తెచ్చుకున్న అనసూయ, ఆ తరువాత పలు టీవీ షోలు చేస్తూనే, సినిమాల్లో నటిస్తోంది.
ఎప్పటికప్పుడూ ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటున్న అనసూయ, ఓవైపు తన మాటలతోనే కాకుండా అందచందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు టీవీ షోలకు గ్లామర్ అద్దిన అతి కొద్ది మంది యాంకర్స్ లో అనసూయ ముందుంటుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకున్న అనసూయ, తాజాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాలోను నటించి ఔరా అనిపించింది.
అనసూయ యాంకరింగ్ తో బిజీగా ఉంటూనే వరుస సినిమాలతో అదరగొడుతోంది. మొన్న విడుదలైన రవితేజ ఖిలాడీ సినిమాలోను గ్లామర్ పాత్రలో నటించి మెప్పించింది. అంతే కాదు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్యలో కీలక పాత్రలో అనసూయ కీలకపాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. మరి కొన్ని సినిమాల్లోను ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ, చాలా బిజీగా ఉంది అనసూయ భరద్వాజ్.