ఆమె పేరు రాజేశ్వరి. గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. ఈ క్రమంలోనే కరోనాతో ఆమె భర్త మరణించాడు. అయితే రాజేశ్వరి స్థానికంగా ఉండే ఓ వ్యక్తి వద్ద వడ్డీకి డబ్బులు తీసుకుంది. వడ్డీ పేరుతో అతడు రాజేశ్వరికి దగ్గరై వివాహేతర సంబంధాన్ని నడిపించాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు జన్మించారు. పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు బాగానే ఉన్నారు. అయితే కరోనాతో ఆ మహిళ భర్త మరణించాడు. ఆ సమయంలో భార్యకు చేతిలో చిల్లగవ్వ లేకపోవడంతో స్థానికంగా ఉండే ఓ వడ్డీ వ్యాపారితో రూ.1లక్ష అప్పుగా తీసుకుంది. అలా కొన్నిరోజులు గడిచింది. వడ్డీ పేరుతో ఆ వ్యక్తి మహిళతో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. కట్ చేస్తే.. చివరికి అతడు ఆ మహిళ చేతిలో హత్యకు గురయ్యాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లాలోని జొన్నగిరి గ్రామంలో రాజేశ్వరి-కేశవయ్య దంపతులు నివాసం ఉండేవారు. వీరికి 10 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగుతూ వచ్చింది. ఇకపోతే కరోనాతో కేశవయ్య మరణించాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని రాజేశ్వరి గుండెలు పగిలేలా ఏడ్చింది. అయితే ఆ సమయంలో రాజేశ్వరి చేతిలో చిల్లి గవ్వ లేదు. పూట గడవడమే కాష్టంగా మారింది. దీంతో ఆమెకు ఏం చేయాలో తెలియక స్థానికంగా ఉండే శంకర్ నాయక్ అనే వడ్డీ వ్యాపారి వద్ద రూ.1 లక్ష అప్పుగా తీసుకుంది. కొన్ని రోజులు గడిచింది. వడ్డీ కోసం శంకర్ నాయక్ అప్పుడప్పుడు రాజేశ్వరి ఇంటికి వస్తుండేవాడు.
ఈ క్రమంలోనే అతడు రాజేశ్వరిపై కన్నేశాడు. ఎలాగైన రాజేశ్వరితో కోరిక తీర్చుకోవాలని అనుకున్నాడు. ఇక తాను అనుకున్నట్లే శంకర్ నాయక్ వడ్డీ పేరుతో ఆమెతో కోరికలు తీర్చుకున్నాడు. రాను రాను శంకర్ నాయక్ వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. డబ్బులు ఇవ్వాలంటూ టార్చర్ చేస్తూనే ఆమెతో కోరికలు తీర్చుకునేవాడు. ఇకపోతే ఇదే విషయం శంకర్ నాయక్ భార్యకు తెలియడంతో పెద్ద గొడవే జరిగింది. దీంతో రాజేశ్వరి తన పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా వదలని శంకర్ నాయక్.. రాజేశ్వరి పుట్టింటికి కూడా వెళ్లేవాడు. డబ్బుల పేరుతో తన అవసరాలు తీర్చుకుని బయటపడేవాడు.
ఇక అతడి టార్చర్ ను భరించలేని రాజేశ్వరి.. శంకర్ నాయక్ ను హత్య చేయాలని అనుకుంది. ఇందులో భాగంగానే పక్కా ప్లాన్ తో ఆ మహిళ శంకర్ నాయక్ ఫోన్ చేసి.. నీ బాకీ డబ్బులు ఇస్తానని, ఈ నెల 10న రామగిరికి రమ్మని చెప్పింది. దీంతో శంకర్ నాయక్ అతడు ఎగేసుకుని రామగిరి వెళ్లాడు. అతడు వెళ్లగానే రాజేశ్వరి పథకం ప్రకారమే ఆమె తల్లితో పాటు కలిసి శంకర్ నాయక్ ను కత్తితో గొంతు కోసి హత్య చేసి తల మొండం వేరు చేశారు. అనంతరం శంకర్ నాయక్ మృతదేహాన్ని పామిడి పరిధిలోని ఎదురుపల్లి రైల్వే పట్టాల సమీపంలో పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిని చూసిన కొందరు స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నిస్వాధీనం చేసున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి రాజేశ్వరిని విచారించారు. ఇక పోలీసుల విచారణలో రాజేశ్వరి అసలు నిజాలను బయటపెట్టింది. దీంతో పోలీసులు రాజేశ్వరితోపాటు ఆమె తల్లిని అరెస్ట్ చేసినట్లుగా సమచారం. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.